ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్‌.. ఆ రెండు జట్లు కూడా! | Sunrisers Eastern Cape qualify for playoffs after annihilating Joburg Super Kings | Sakshi
Sakshi News home page

SA 20 2024: ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్‌.. ఆ రెండు జట్లు కూడా!

Feb 1 2024 1:23 PM | Updated on Feb 1 2024 1:45 PM

Sunrisers Eastern Cape qualify for playoffs after annihilating Joburg Super Kings - Sakshi

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్.. వరుసగా రెండో సారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

ఇప్పటివరకు ఈ లీగ్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచింది. సన్‌రైజర్స్‌తో పాటు పార్ల్‌ రాయల్స్‌, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో కూడా ప్లే ఆఫ్స్‌కు ​క్వాలిఫై అయ్యాయి. నాలుగో స్ధానం కోసం సూపర్‌ కింగ్స్‌, ప్రిటోరియా క్యాపిటల్స్‌, ఏంఐ కేప్‌టౌన్‌ పోటీపడతున్నాయి.

నిప్పులు చేరిగిన సన్‌రైజర్స్‌ పేసర్లు..
ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే సన్‌రైజర్స్‌ పేసర్లు నిప్పులు చేరిగారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి కేవలం 78 పరుగులకే కుప్పకూలింది.  ఈస్టర్న్ కేప్‌ బౌలర్లలో డానియల్‌ వోరల్, కుర్గర్‌ తలా మూడు వికెట్లు పడగొట్టగా, స్వాన్‌పోయెల్, జానెసన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో  మాడ్సెన్ (32) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్‌ మలాన్‌(40 నాటౌట్‌), టామ్‌ అబెల్‌(26) పరుగులతో మ్యాచ్‌ ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement