రోహిత్‌ అత్యాశపరుడు.. ధోని షాకింగ్‌ వీడియో..!

Starsports Releases Ipl 14 Dhoni Video Viral - Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 జంగ్‌ అప్పుడే మొదలైంది. అందులో భాగంగా  ఐపీఎల్ 2021కి ముందు ఎంఎస్ ధోని సన్యాసిగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. సన్యాసిగా ఉన్న ఎంఎస్‌ ధోని వీడియోను స్టార్‌స్పోర్ట్‌ రిలీజ్‌ చేసింది. ఐపీఎల్‌-21 ప్రమోషన్‌లో భాగంగా తీసిన వీడియోలో ధోని గుండుతో కనిపించాడు. ఇప్పుడు ఎంఎస్ ధోని ఈ లుక్ వెనుక గల కారణం బయటపడింది. వీడియోలో ధోని.. రోహిత్ శర్మను అత్యాశతో  ఉన్నాడని తెలిపాడు.

ఈ వీడియోలో ఎంఎస్ ధోని రోహిత్ శర్మ కథను కొంతమంది పిల్లలకు వివరించాడు. అందులో ఎంఎస్‌ ధోని 'నేటి అంశం దురాశ. ఇది హిట్‌మ్యాన్ రోహిత్ కథ. ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా సారథ్యం వహించిన రోహిత్ ఐపీఎల్‌ కప్పును  ఐదుసార్లు గెలిచినప్పటికీ, అతనికి ఇంకా ఆశ తీరలేదు’ అని పిల్లలకు తెలిపాడు. వీడియోలో ఒక  పిల్లవాడు ఆత్యాశగా ఉండడం మంచిది కాదా..! అని అడగగా ధోని కాదు.. అత్యాశగా ఉండడం కూల్‌ అని సమాధానమిచ్చాడు. వివో ఐపీఎల్‌లో ఇది భారత్‌ కొత్త మంత్రమని తెలిపాడు. అంతేకాకుండా హిట్‌మ్యాన్ మళ్లీ హ్యాట్రిక్ కొడతాడా ..? అన్న ప్రశ్నకు  ధోని సమాధానమిస్తూ.. దీనికి  సమయమే సమాధానం తెలియజేస్తుందని తెలిపాడు.

కాగా, ఐపీఎల్  14వ ఎడిషన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరుగనుంది. ఈ టోర్నమెంట్ 6 వేర్వేరు వేదికలలో జరుగనుండగా,  ప్రతి జట్టు 4 వేదికలలో ఆడతాయి. ఈ సారి ఐపీఎల్‌లో ఏ టీమ్‌కు స్వంత వేదికలో ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ 2020 మాదిరిగానే మ్యాచ్‌లు సాయంత్రం  7:30 గంటలకు ప్రారంభమవుతాయి. మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్లేఆఫ్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి క్వాలిఫయర్స్ మే 25, రెండో క్వాలిఫయర్స్ మ్యాచ్‌ 28 తేదీల్లో జరుగనున్నాయి. ఎలిమినేటర్ మే 26న, ఫైనల్‌ మ్యచ్‌ మే 30న జరగనుంది.(చదవండి:ఐపీఎల్‌ 2021: సీఎస్‌కే లాజిక్‌ అదేనా?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top