‘నేను కూడా బ్యాటింగ్‌ ఎంచుకోవాలనుకున్నా’

SRH Won The Toss And Elected Bat First Against Punjab - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ముందుగా బ్యాటింగ్‌ చేయడానికి మొగ్గుచూపాడు.  ఇప్పటివరకూ సన్‌రైజర్స్‌ ఐదు మ్యాచ్‌లాడి రెండు విజయాలు సాధించగా, కింగ్స్‌ పంజాబ్‌ ఐదు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌తో ఆడిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి చెందగా, సీఎస్‌కేతో ఆడిన తన గడిచిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు కూడా చుక్కెదురైంది. దాంతో మరొక విజయం కోసం అటు సన్‌రైజర్స్‌, ఇటు కింగ్స్‌ పంజాబ్‌లు ఆరాటపడుతున్నాయి.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన తర్వాత వార్నర్‌ మాట్లాడుతూ.. ముందుగా బ్యాటింగ్‌ చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించాలనుకుంటున్నట్లు తెలిపాడు. గత మ్యాచ్‌లో ఛేజింగ్‌లో తడబడటంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేయలనుకుంటున్నట్లు వార్నర్‌ పేర్కొన్నాడు. (చదవండి: ‘టీ20’ని మార్చండి: సునీల్‌ గావస్కర్‌)

అదే సమయంలో కేఎల్‌ రాహుల్‌  కూడా టాస్‌ గెలిస్తే బ్యాటింగే చేయాలనుకున్నట్లు పేర్కొన్నాడు.  చాలా గేమ్‌లను దగ్గరగా వచ్చి ఓడిపోయిన విషయాన్ని రాహుల్‌ గుర్తుచేసుకున్నాడు. తాను టాస్‌ ఓడిపోతానని అనుకున్నానని, కానీ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. తమకు ఆరంభం బాగున్నా, మ్యాచ్‌ ఫినిషింగ్‌ సరిగా లేదన్నాడు. అందుకే వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోతున్నామన్నాడు. క్రీజ్‌లో సెట్‌ అయిన బ్యాట్స్‌మన్‌ భారీ స్కోర్లు చేయలేకపోవడం ఓటములకు కారణమన్నాడు. ఇక బౌలర్లు కూడా సరిగా తమ ప్రణాళికల్లో అమలు చేయలేకపోతున్నారన్నాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఒక మార్పు చేసింది. సిద్ధార్ద్‌ కౌల్‌ స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌ను జట్టులోకి తీసుకోగా, కింగ్స్‌ పంజాబ్‌ మూడు మార్పులతో బరిలోకి దిగింది. జోర్డాన్‌, బ్రార్‌, సర్ఫరాజ్‌లను రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చో బెట్టిన పంజాబ్‌.. ప్రభ్‌ సిమ్రాన్‌, అర్షదీప్‌, ముజీబ్‌లను తుది జట్టులోకి తీసుకుంది. పంజాబ్‌పై వరుసగా 8 హాఫ్‌ సెంచరీలను సాధించిన ఘనత వార్నర్‌ది. దాంతో వార్నర్‌ మరోసారి మెరిసే అవకాశం ఉంది.

ప్రధానంగా ఇరుజట్లలో బౌలింగ్‌ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. సన్‌రైజర్స్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ దూరం కావడం వేధిస్తుండగా, కింగ్స్‌ పంజాబ్‌కు కూడా సరైన బౌలింగ్‌ వనరులు లేక సతమతమవుతోంది. కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌ సమస్యగా మారింది. కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌ గాడిలో పడితే మరో ఆసక్తికర పోరు జరగవచ్చు. ఇప్పటివరకూ ఇరు  జట్లు 14 మ్యాచ్‌లు ఆడగా సన్‌రైజర్స్‌ 10 మ్యాచ్‌ల్లో గెలవగా, కింగ్స్‌ పంజాబ్‌ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.(చదవండి: ‘బీసీసీఐ మైండ్‌ గేమ్‌ ఆడుతోంది’)

రషీద్‌ వర్సెస్‌ రాహుల్‌
ఇప్పటివరకూ ఈ ఐపీఎల్‌లో రషీద్‌ తన ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఇక్కడ రషీద్‌ ఎకానమీ 5.20గా ఉంది. ఓవరాల్‌గా ఈ అఫ్గాన్‌ సంచలనం 51 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 60 వికెట్లు సాధించాడు. ఇక రాహుల్‌ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 302 పరుగులు సాధించి అత్యధిక పరుగుల జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఇందులో 132 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు రాహుల్‌. ఈ సీజన్‌లో రాహుల్‌ యావరేజ్‌ 75కి పైగా ఉండగా, స్టైక్‌రేట్‌ 141.78గా ఉంది. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 72 మ్యాచ్‌ల్లో 2,279 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 18 అర్థ సెంచరీలు ఉన్నాయి. రాహుల్‌ స్టైక్‌రేట్‌ 138.62గా ఉంది.

కింగ్స్‌ పంజాబ్‌
కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, మన్‌దీప్‌ సింగ్‌, నికోలస్‌ పూరన్‌, సిమ్రాన్‌ సింగ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, రవిబిష్నోయ్‌, ముజీబ్‌ వార్నర్‌, అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, కాట్రెల్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జోనీ బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియాం గార్గ్‌, అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సామద్‌, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, టి నటరాజన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top