IPL 2023: లక్నోతో సన్‌రైజర్స్‌ కీలక పోరు.. 13 కోట్ల ఆటగాడికి మరో సారి నోఛాన్స్‌

SRH Playing XI vs LSG: Harry Brook No chance for return to playing XI - Sakshi

ఐపీఎల్‌-2023లో ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకునేందుకు ఉప్పల్‌ స్టేడియంలో నేడు(శనివారం) జరిగే కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. గత మ్యాచ్‌లో రాజస్తాన్‌పై విజయం సాధించిన ఎస్‌ఆర్‌హెచ్‌.. అదే జోరును ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. 

ఈ మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఆల్‌రౌండర్‌ వివ్రాంత్‌ శర్మ స్థానంలో అన్మోల్‌ప్రీత్ సింగ్, టి నటరాజన్‌ స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ సబ్‌గా జట్టులోకి వచ్చిన అన్మోల్‌ప్రీత్ సింగ్ 33 పరుగులతో ఆకట్టుకున్నాడు.

ఇక మరోసారి మయాంక్‌ అగర్వాల్‌, హ్యారీ బ్రూక్‌ బెంచ్‌కే పరిమితమమ్యే ఛాన్స్‌ ఉంది. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి దారుణంగా  విఫలమవతున్న హ్యారీ బ్రూక్‌ను రాజస్తాన్‌తో మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ పక్కన పెట్టింది. అతడి స్థానంలో న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌కు ఛాన్స్‌ ఇచ్చారు. అయితే ఫిలిప్స్‌ సంచలన ఇన్నింగ్స్‌తో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కాబట్టి మరోసారి బ్రూక్‌ స్థానంలో ఫిలిప్స్‌ వైపే ఎస్‌ఆర్‌హెచ్‌ మొగ్గు చూపే ఛాన్స్‌ ఉంది. కాగా రూ. 13.25 కోట్ల భారీ ధరకు కొనగోలు చేసిన హ్యారీ బ్రూక్‌ తనదైన మార్క్‌ చూపడంలో విఫలమయ్యాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహల్‌ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, , మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్ఖండే, ఉమ్రాన్‌ మాలిక్‌
చదవండి: మేమంతా విఫలమయ్యాం.. అతడొక్కడే అదరగొట్టాడు! టర్న్‌ చేస్తాడని అనుకున్నా: హార్దిక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top