ఫెన్సర్‌ భవానీ దేవికి క్రీడా శాఖ చేయూత 

Sports Ministry approves Rs 8 16 Lakh for fencer Bhavani Devi  - Sakshi

ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫెన్సింగ్‌ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవి (తమిళనాడు) వచ్చే ఏడాది నాలుగు అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలలో పాల్గొనేందుకు భవానీ దేవికి రూ. 8 లక్షల 16 వేలు కేంద్ర క్రీడా శాఖ మంజూరు చేసింది. జార్జియాలో వచ్చే జనవరి 14 నుంచి 16 వరకు జరిగే ప్రపంచకప్‌ టోర్నీతో భవానీ దేవి సీజన్‌ మొదలవుతుంది. ఆ తర్వాత బల్గేరియాలో, గ్రీస్‌లో, బెల్జియంలో జరిగే ప్రపంచకప్‌ టోర్నీలలోనూ ఆమె పోటీపడుతుంది. 

వైల్డ్‌ కార్డుతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో...
మెల్‌బోర్న్‌లో వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 30 వరకు జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ఐదుసార్లు రన్నరప్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ముర్రే చివరిసారిగా 2019లో ఆడాడు. అనంతరం తుంటి గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకొని ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడాల్సి ఉండగా... కరోనా బారిన పడటంతో బరిలోకి దిగలేదు. 

చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top