Ms Dhoni Viral Videos: ప్రేమించే వారికోసం ఎంతదూరమైనా.. అదీ ధోని అంటే!

Specially-Abled Fan Overwhelmed After Meeting MS Dhoni Viral - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మనకు వింటేజ్‌ ధోని కనిపించిన సంగతి తెలిసిందే. ఫినిషర్‌ అనే పదానికి నిర్వచనం చెబుతూ పలుమార్లు మంచి ఇన్నింగ్స్‌లతో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో అయితే ధోని తన దనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. వరుస ఓటములతో డీలా పడిన సీఎస్‌కే ఈ సీజన్‌లో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది.

ఈ విషయం పక్కనబెడితే.. ధోనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వేరే రేంజ్‌లో ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన తర్వాత ధోని మిలటరీ ట్రైనింగ్‌లో భాగంగా చాలా క్యాంప్స్‌ను సందర్శిస్తుంటాడు. తాజాగా రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో ధోని తన అభిమానిని కలుసుకొని ఆమెను సంతోషంలో ముంచెత్తాడు. ఆ అభిమాని పేరు లావణ్య పిలానియా. పుట్టుకతోనే అంగవైకల్యం బారిన పడిన లావణ్య ధోని అంటే విపరీతమైన అభిమానం. అందునా ధోని బొమ్మను గీసి అతనికి కానుకగా ఇవ్వాలని భావించింది.


ఇది తెలుసుకున్న ధోని లావణ్యను స్వయంగా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా లావణ్య తాను గీసిన బొమ్మను ధోనికి చూపించింది. కాగా ధోని లావణ్య చేతులను దగ్గరికి తీసుకోవడం.. కన్నీళ్లను తుడవడం.. తన బొమ్మ గీసినందుకు అభినందించడం లావణ్యకు తెగ సంతోషం కలిగించాయి. దీంతో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధోనితో ఉన్న క్షణాలను పోస్ట్‌ చేసింది.

''ఆయన నా చేతులు తడుముతూ.. ఏడ్వకూడదు.. జీవితాన్ని ఆనందంగా గడపాలి. అని పేర్కొన్నారు. ఆ తర్వాత తన బొమ్మ గీసినందుకు థాంక్యూ చెప్పారు. తన విలువైన సమయాన్ని నాకోసం కేటాయించారు.. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నువ్వు సంతోషంగా ఉన్నావా అని ధోని భయ్యా నన్ను అడిగినప్పుడు.. నా దగ్గర రియాక్షన్‌ లేదు.. ఎందుకంటే ఆయన మాటలు విలువ కట్టలేనివి. మే 31 2022.. కచ్చితంగా నా జీవితంలో మరిచిపోలేని రోజు అవుతుంది'' అని భావోద్వేగంతో రాసుకొచ్చింది.

చదవండి: చారిత్రక లార్డ్స్‌ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top