IPL2021: ఎప్పుడు, ఎక్కడ, ఎలా...?

Sourav Ganguly opens up on IPL 2021 suspension - Sakshi

ఐపీఎల్‌ మళ్లీ నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ

పరిశీలనలో విదేశీ ప్రత్యామ్నాయాలు

మా వద్ద ఆడమంటూ ఇంగ్లండ్‌ కౌంటీల ఆహ్వానం  

బీసీసీఐ అధికారిక ప్రకటన ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రస్తుతానికి వాయిదా పడిందంతే. 2021 సీజన్‌ను రద్దు చేయలేదని బోర్డు ఉన్నతాధికారులు ఇప్పటికే వెల్లడించారు. లీగ్‌ నిర్వహణతో పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో మిగిలిన 31 మ్యాచ్‌లను కూడా నిర్వహించి టోర్నీని ముగించాలనేది బోర్డు ఆలోచన. అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే భారత్‌లో రాబోయే కొన్ని నెలల్లో కూడా ఇప్పట్లో కరోనా తగ్గిపోయి పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి మన దేశంలో మాత్రం జరగడం మాత్రం దాదాపు అసాధ్యం. అసలు బోర్డు ముందు అవకాశాలు, అనుకూల సమయం, సాధ్యాసాధ్యాలు  ఏమిటనే అంశాలను చూస్తే...         

యూఏఈలో అయితే...
ఐపీఎల్‌లో మరో 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సాధ్యమైనన్ని సార్లు రోజూ రెండు మ్యాచ్‌లు నిర్వహించగలిగితే గరిష్టంగా మూడు వారాల్లో టోర్నీని ముగించవచ్చు. టి20 ప్రపంచకప్‌కు ముందుగానీ తర్వాతగానీ టోర్నీని నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. వేదిక అనగానే అన్నింటికంటే ముందు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పేరు వినిపిస్తోంది. ఇప్పటికే భారత్‌ నుంచి తరలించి టి20 ప్రపంచకప్‌ను కూడా ఇక్కడే జరపాలని భావిస్తున్న నేపథ్యంలో యూఏఈ అందరికీ అనుకూలంగా ఉంటుంది. పైగా 2020 ఐపీఎల్‌లో ఒక్క సమస్య కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించిన రికార్డు కూడా ఉంది. వరల్డ్‌కప్‌ ఇక్కడే ఉంటే బయో బబుల్‌లు మారాల్సిన సమస్య కూడా పెద్దగా ఉదయించదు.  

కరోనా కరుణిస్తేనే...
అన్నింటికి మించి కరోనా తీవ్రతనే ఐపీఎల్‌ నిర్వహణను శాసిస్తుందనేది వాస్తవం. టి20 ప్రపంచకప్‌ నిర్వహణకు కూడా ఇదే వర్తిస్తుంది. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. ఇంగ్లండ్‌లో టోర్నీ నిర్వహించినా... అక్కడి ఆంక్షలు, క్వారంటైన్‌ నిబంధనల కారణంగా వివిధ దేశాల క్రికెటర్లందరినీ అక్కడికి చేర్చడం అంత సులువు కాదు. దాదాపు అదే సమయంలో ప్రతీ జట్టుకు ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పినట్లు అన్ని క్రికెట్‌ బోర్డులతో మాట్లాడి ఇతర షెడ్యూల్‌ల విషయంలో కాస్త మార్పుచేర్పులు చేయగలిగితేనే ఐపీఎల్‌ జరుగుతుంది.   

ఇంగ్లండ్‌లో అయితే...
ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం సెప్టెంబర్‌ 14 వరకు భారత జట్టు ఆ దేశంలోనే ఉంటోంది. పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఇంగ్లండ్‌లోని లీగ్‌లలో ఆడుతుంటారు కాబట్టి పని సులువవుతుంది. సెప్టెంబర్‌లో తమ వద్ద ఐపీఎల్‌ నిర్వహించుకోవచ్చని, ఇదే విషయాన్ని బీసీసీఐతో మాట్లాడాలంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)కి పలు కౌంటీలు లేఖ రాశాయి. మిడిల్‌ఎసెక్స్, సర్రే, వార్విక్‌షైర్, లాంకషైర్‌ కౌంటీలు ఐపీఎల్‌ నిర్వహణ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే భారత్‌ కోణంలో చూస్తే ఇది అంత సులువైన విషయం కాదని... దీనిపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని కూడా ఈసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

సెప్టెంబర్‌ చివర్లో అయితే...
భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన తర్వాత, ఆ తర్వాత ప్రపంచకప్‌కు ముందు మిగిలిన పరిమిత సమయంలో టోర్నీని నిర్వహించడం పెద్ద సవాల్‌ కావచ్చు. అక్టోబర్‌ 16 నుంచి టి20 ప్రపంచకప్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. క్వారంటైన్‌ సమయం, వార్మప్‌ మ్యాచ్‌లు చూసుకుంటే సెప్టెంబర్‌ చివరి నుంచి జట్లు వరల్డ్‌కప్‌ వేదికలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌తో  సుదీర్ఘ సిరీస్, ఐపీఎల్, వరల్డ్‌కప్‌... ఇలా వరుసగా ఆడాలంటే భారత ఆటగాళ్లకే చాలా ఇబ్బంది. వారంతా కనీసం వారం రోజులు విశ్రాంతి ఆశిస్తారు. అప్పుడు రెండు వారాల సమయమే మిగులుతుంది. మరోవైపు అదే తేదీల్లో ఇంగ్లండ్‌... బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లనుంది.

నవంబర్‌ చివర్లో జరిగితే...
వరల్డ్‌కప్‌ ముగిసిన వెంటనే ఐపీఎల్‌ను నిర్వహించాలి. పరిస్థితులు మెరుగుపడితే మన దేశంలోనే జరపవచ్చు కూడా. అయితే విదేశీ ఆటగాళ్లు అందుబాటులోకి రావడం కష్టంగా మారిపోతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లకు నవంబర్‌ చివరి వారం నుంచి ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ఉంటుంది. భారత్‌కు కూడా వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌ ఈ సిరీస్‌ షెడ్యూల్‌ను కాస్త వెనక్కి జరిపే ప్రత్యామ్నాయం ఒకటి మిగిలి ఉంది. అయితే ఆసీస్, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు లేకుండా వేరే ఆటగాళ్లతో ముగించగలమని భావిస్తే నవంబర్‌ చివరి వారం ఐపీఎల్‌ నిర్వహణకు సరైన సమయం.

–సాక్షి క్రీడా విభాగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-05-2021
May 07, 2021, 10:41 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస‍్తోంది. రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతిలో...
07-05-2021
May 07, 2021, 10:32 IST
మొట్టమొదటి సారి వెండితెర మీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన...
07-05-2021
May 07, 2021, 10:22 IST
బాగేపల్లి/కర్ణాటక: బాగేపల్లి తాలూకాలోని దేవరెడ్డిపల్లి గ్రామానికి చెందిన డి.ఎస్‌. నాగిరెడ్డి (54), అతని కుమారుడు సుబ్బారెడ్డి(29)ని కరోనా పొట్టనబెట్టుకుంది. పరగోడు...
07-05-2021
May 07, 2021, 10:04 IST
సాక్షి, సిద్దిపేట: కరోనా మహమ్మారితో ప్రజలు అతలాకుతలం అవుతున్న వేళ.. సిద్దిపేట జిల్లా ప్రజానీకానికి మంత్రి హరీశ్‌రావు శుభవార్త అందించారు....
07-05-2021
May 07, 2021, 09:37 IST
సాక్షి, అమరావతి : కోవిడ్‌ రోగుల చికిత్స కోసం అవసరం మేరకు పడకల సంఖ్య మరింత పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
07-05-2021
May 07, 2021, 09:26 IST
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో రెండ్రోజుల వ్యవధిలో 12 మంది మృత్యువాతపడ్డారు. కొద్ది...
07-05-2021
May 07, 2021, 09:16 IST
గద్వాల రూరల్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకిన ఓ గర్భిణికి 108 సిబ్బంది కాన్పు చేసి మానవత్వం చాటారు. జోగుళాంబ...
07-05-2021
May 07, 2021, 08:57 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌  విధించబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధిస్తే జనజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక...
07-05-2021
May 07, 2021, 08:05 IST
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం ఫైజర్, బయో టెక్నాలజీ (జర్మనీ) కంపెనీలు భారీ సంఖ్యలో వ్యాక్సిన్లను విరాళంగా అందజేసేందుకు...
07-05-2021
May 07, 2021, 07:54 IST
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను వేయించుకున్నాడు....
07-05-2021
May 07, 2021, 04:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా శుక్రవారం నుంచి ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
07-05-2021
May 07, 2021, 04:31 IST
మాస్కో: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రయోగించడానికి ప్రపంచంలో అధికారికంగా రిజిస్టరయిన మొట్టమొదటి వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌–వి. దీన్ని రష్యా అభివృద్ధి చేసింది....
07-05-2021
May 07, 2021, 04:29 IST
సాక్షి, అమరావతి: దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి, అవసరం మధ్య అంతులేని వ్యత్యాసం నెలకొంది. టీకాల ఉత్పత్తి పెంచడానికి చర్యలు...
07-05-2021
May 07, 2021, 04:20 IST
సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితులపై ప్రధాని మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు....
07-05-2021
May 07, 2021, 04:04 IST
ప్రజారోగ్యం విషయంలో అధిక లాభాల సాధన కోసం దురాశ అవధులు మీరిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి బదులుగా...
07-05-2021
May 07, 2021, 03:57 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్‌కు...
07-05-2021
May 07, 2021, 03:39 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కేటాయింపులను పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర...
07-05-2021
May 07, 2021, 03:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పట్టపగ్గాల్లేకుండా భారతదేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల...
07-05-2021
May 07, 2021, 02:33 IST
సాక్షి, నెట్‌వర్క్‌: కరోనా ఫస్ట్‌ వేవ్‌లో ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట ఐదు...
07-05-2021
May 07, 2021, 02:16 IST
కరోనా కట్టడికిగాను గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో పేదలు, ధనికుల నడుమ సామాజిక, ఆర్థిక అంతరాలు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top