అత‌డొక అద్భుతం.. టెస్టు క్రికెట్ లెజెండ్ అవుతాడు: గంగూలీ | Sourav Ganguly backs Rishabh Pant for Test greatness | Sakshi
Sakshi News home page

అత‌డొక అద్భుతం.. టెస్టు క్రికెట్ లెజెండ్ అవుతాడు: గంగూలీ

Sep 10 2024 8:27 AM | Updated on Sep 10 2024 9:15 AM

Sourav Ganguly backs Rishabh Pant for Test greatness

టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ సుదీర్ఘ విరామం త‌ర్వాత టెస్టుల్లో పున‌రాగమానికి సిద్ద‌మ‌య్యాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జ‌ట్టులో పంత్‌కు చోటు ద‌క్కింది. 

కారు ప్ర‌మాదం నుంచి కోలుకున్న త‌ర్వాత పంత్ ఆడ‌నున్న తొలి టెస్టు సిరీస్ ఇదే. ఈ నేప‌థ్యంలో పంత్‌పై భార‌త మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ ప్లేయర్‌లలో ఒకరిగా పంత్ నిలుస్తాడ‌ని దాదా కొనియాడాడు. ఒత్త‌డిలో కూడా పంత్ అద్బుతంగా ఆడుతాడ‌ని తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో గంగూలీ చెప్పుకొచ్చాడు.

"రిషబ్ పంత్‌ను భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట‌ర్‌గా భావిస్తున్నాను. అత‌డు ఇప్ప‌టికే రెడ్ బాల్ క్రికెట్‌లో ఎన్నో సంచ‌ల‌న ఇన్నింగ్స్‌లు ఆడాడు. అత‌డికి అద్భుత‌మైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. పంత్ ఇదే ఫామ్‌ను కొన‌సాగిస్తే.. టెస్ట్ క్రికెట్‌లో క‌చ్చితంగా ఆల్ టైమ్ గ్రేట్ అవుతాడు. 

అయితే వైట్ బాల్ క్రికెట్‌లో అత‌డు కాస్త మెరుగవ్వాలి" సౌర‌వ్ పేర్కొన్నాడు. కాగా వైట్ బాల్ ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో పంత్‌కు మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా 2020-21లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌లో పంత్ ఆడిన ఇన్నింగ్స్‌లు ఎప్ప‌ట‌కి చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచిపోతాయి.

గబ్బాలో ఆడిన మ్యాచ్ విన్నింగ్ నాక్ గురించి ఎంత చెప్పుకున్న త‌క్కువే. ఇప్పుడు మ‌ళ్లీ టెస్టుల్లో పంత్ రీఎంట్రీ ఇవ్వ‌డం భార‌త జ‌ట్టు క‌లిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. కాగా బంగ్లాతో సిరీస్ సెప్టెంబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement