Shubman Gill: నాన్నకు ప్రేమతో.. | shubman gill century to england test | Sakshi
Sakshi News home page

Shubman Gill: నాన్నకు ప్రేమతో..

Feb 5 2024 9:33 AM | Updated on Feb 5 2024 10:06 AM

shubman gill century to england test - Sakshi

విశాఖ: నాన్న అను రెండు అక్షరాలు మరుపురాని మధుర క్షణాలు. ప్రతి ఒక్కరికి మొదటి హీరో తండ్రే. ఆ తండ్రి ముందు ఏదైనా విషయం సాధిస్తే.. అతని ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది వైఎస్సార్‌ స్టేడియంలో.. టెస్ట్‌లో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ ఆదివారం వైఎస్సార్‌ స్టేడియంలో చెలరేగిపోయాడు.

మూడో టెస్ట్‌కు జట్టులో ఉంటాడా లేదా అనే సంశయం నెలకొనగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా సెంచరీ చేశాడు. మూడో రోజు ఆటలో తనకంటే ముందు ఓపెనర్లు ఇద్దరూ కేవలం రెండు పరుగుల వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరగా.. ఆ స్థానంలో వచ్చిన గిల్‌ ఆచితూచి ఆడాడు. రెండు భారీ భాగస్వామ్యాలతో నిలకడగా రాణించి సెంచరీని నమోదు చేశాడు. గిల్‌ తండ్రి లఖ్వీందర్‌ సింగ్‌ స్టేడియంలో కూర్చొని కుమారుడి ఆటను పూర్తిగా ఆస్వాదించగా.. సెంచరీ పూర్తి చేసినప్పుడు తండ్రి వైపు చూసి గిల్‌ అభివాదం చేశాడు. ఇదే విషయాన్ని వ్యాఖ్యాత రవిశాస్తి ప్రశ్నించగా గిల్‌ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement