Shikhar Dhawan To Appear As Policeman on Zee TV Show - Sakshi
Sakshi News home page

Shikhar Dhawan: టీమిండియాలో నో ఛాన్స్‌.. హిందీ సీరియల్‌లో నటిస్తున్న శిఖర్ ధావన్!

Mar 21 2023 2:21 PM | Updated on Mar 21 2023 3:07 PM

Shikhar Dhawan To Appear As Policeman on Zee TVs Show - Sakshi

టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ దావన్‌ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న ధావన్‌ను భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. రోహిత్‌ గైర్హాజరీ నేపథ్యంలో పలు సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ధావన్‌.. ఇప్పుడు పూర్తిగా జట్టులోనే చోటు కోల్పోయాడు. దావన్‌ చివరగా గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా తరపున ఆడాడు. అనంతరం అతడు స్థానాన్ని యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో సెలక్టర్లు భర్తీ చేశారు.

అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా దావన్‌ వ్యవహరించబోతున్నాడు. గత సీజన్‌లో తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్‌ అగర్వాల్‌ స్ధానంలో గబ్బర్‌ను పంజాబ్‌ నియమించింది. ఈ ఏడాది సీజన్‌కు ముందు మయాంక్‌ అగర్వాల్‌ను పంజాబ్‌ విడిచిపెట్టింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది.

సీరియల్‌లో నటిస్తున్న ధావన్‌...
కాగా ఐపీఎల్‌ ఆరంభానికి ముందు ధావన్‌ ఓ హిందీ ఓ హిందీ సీరియల్‌లో నటిస్తూ బిజీబీజీగా ఉన్నాడు. జీ ఛానెల్‌లో ప్రసారమయ్యే హిందీ సీరియల్ ‘కుండలి భాగ్య’లో  ఓ పోలీస్ అధికారి పాత్రలో గబ్బర్‌ కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ధావన్‌ తన ఇన్స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 

ధావన్‌ పోలీస్‌ లూక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇ​ ధావన్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా ఎక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు డ్యాన్స్‌, ఇన్‌స్టా రీల్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇప్పడు మరో కొత్త రోల్‌లో అభిమానలను గబ్బర్‌ అలరించబోతున్నాడు.
చదవండి: Virender Sehwag: కుంబ్లేతో గొడవలు.. హెడ్‌కోచ్‌గా నన్ను రమ్మని కోహ్లి కోరాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement