IPL 2023, PBKS Vs DC: Shikhar Dhawan Takes Stunning Catch To Dismiss David Warner, Video Viral - Sakshi
Sakshi News home page

#ShikarDhawan: అద్బుత విన్యాసం.. వయసుతో పనేంటి!

May 17 2023 11:24 PM | Updated on May 18 2023 8:34 AM

Shikar Dhawan Stunning Catch Of David Warner-Age Was Not-A-Priority - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. 37 ఏళ్ల వయసులోనూ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో అద్బుత విన్యాసం చేయడం ధావన్‌కే చెల్లింది.

విషయంలోకి వెళితే.. సామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ రెండో బంతి వార్నర్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచింది. కవర్స్‌లో ఉన్న ధావన్‌ ఎడమవైపుకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే తొలుత బంతి చేతి నుంచి జారిపోతుందేమో అనిపించింది. కానీ ధావన్‌ కిందపడినప్పటికి బంతిని ఒడిసి పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: #ShikarDhawan: గోల్డెన్‌ డకౌట్‌.. ఓపెనర్‌గా 'గబ్బర్‌' అత్యంత చెత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement