
క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మృతి పట్ల క్రీడాలోకం అశ్రు నివాళి అర్పిస్తోంది. 52 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం చెందిన వార్న్‌పై క్రికెట్‌కు అతీతంగా అన్ని వైపుల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. అలాంటి వార్న్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల నుంచి వార్న్‌తో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. భారత్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న వార్న్‌కు ఒక సందర్భంలో మాత్రం సొంత దేశంలో ఘోర అవమానం జరిగింది.
ఇది 2012 నాటి మాట. ఆ దేశానికి చెందిన జూ వీక్లీ అనే మ్యాగజైన్.. వార్న్‌ను ఘోరంగా అవమానించింది. షేన్ వార్న్.. బ్రిటీష్ మోడల్.. నటి లిజ్ హర్లేతో జరిపిన ప్రేమాయణమే ముఖ్య అంశంగా తీసుకొని ఆ ఏడాదికి గాను ''అన్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్‌గా'' పరిగణించింది. లిజ్ హార్లేతో రిలేషన్ సమయంలో వార్న్ ఒక ప్లేబాయ్‌గా మారిపోయాడని.. విచ్చలవిడిగా తినడం.. తాగడం.. తిరగడం చేసేవాడని తెలిపింది. 42 ఏళ్ల వయసులో నవ మన్మథుడిగా ముద్రించుకోవడం అతనికే చెల్లిందంటూ మ్యాగజైన్ అవమానపరుస్తూ రాసుకొచ్చింది.
క్రికెట్‌లో ఎంత పేరు సంపాదించాడో.. ఆటకు వెలుపల అన్నే వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి. ఆటలో ఏనాడు ఒక మచ్చ కూడా లేని ఈ దిగ్గజం బయట మాత్రం వివాదాలకు కేంద్ర బింధువుగా మారాడు. 2006లో భార్య సిమోన్‌తో విడాకుల అనంతరం వార్న్ నడిపిన రాసలీలలకు అంతే లేదు. చాలా మంది అమ్మాయిలకు పర్సనల్‌గా అసభ్యకర సందేశాలు పంపుతూ ఎప్పుడు వార్తల్లో ఉండేవాడు.
చదవండి: Shane Warne Demise:'ఇప్పటికీ షాక్‌లోనే.. జీవితం మనం ఊహించినట్లు ఉండదు'
Shane Warne: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'