కెరీర్‌లో చాలా ఎదగాలి.. పెళ్లికి తొందరేంలేదు: అఫ్రిదికి కాబోయే అల్లుడు | Shaheen Afridi Shares Update His Marriage Plans Shahid Afridi Daughter | Sakshi
Sakshi News home page

Shaheen Afridi: కెరీర్‌లో చాలా ఎదగాలి.. పెళ్లికి తొందరేంలేదు

Sep 2 2021 12:24 PM | Updated on Sep 2 2021 7:53 PM

Shaheen Afridi Shares Update His Marriage Plans Shahid Afridi Daughter - Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌ యువ సంచలనం.. బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. కెరీర్‌లో ఇంకా చాలా ఎదగాల్సి ఉందని.. పెళ్లికి ఇప్పుడేం తొందర లేదని తెలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురు అక్సా అఫ్రిదితో వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి పెళ్లి జరగబోయేది నిజమేనని.. ఎప్పుడు చేయాలనేది మా రెండు కుటుంబాలు మాట్లాడుకుంటామని షాహిద్‌ అఫ్రిది కూడా మీడియాకు గతంలోనే వెల్లడించాడు.  తాజాగా షాహిన్‌ అఫ్రిది తన పెళ్లిపై వస్తున్న వార్తలకు మరోసారి చెక్‌ పెట్టాడు. 

''నా పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు. కెరీర్‌లో ఇది నాకు కీలక సమయం. అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్‌ బౌలర్‌గా మారుతున్న సమయం. ఇలాంటి దశలో ఎలా ముందుకు వెళ్లాలన్నది మాత్రమే ఆలోచిస్తున్నా.  బౌలింగ్‌లో  రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. జట్టు తరపున ఆడామా.. మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టామా.. గెలిపించామా అన్న చందంగా నా కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా. బౌలింగ్‌లో మంచి ఫాం కనబరిస్తే రికార్డులు వాటంతట అవే వస్తాయి. నాకు తెలిసి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటూ జట్టుకు సుధీర్ఘ కాలం పాటు సేవలందించాలని అనుకుంటున్నా. ఇక రమీజ్‌ రజాను పీసీబీ చైర్మన్‌ను చేయడంపై సంతోషంగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.


ఇక షాహిన్‌ అఫ్రిది ప్రస్తుతం పాకిస్తాన్‌ జట్టులో కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ మంచి ఫామ్‌ కనబరుస్తున్న షాహిన్‌ ఇటీవలే విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లు తీసిన అఫ్రిది మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా షాహిన్‌ అఫ్రిది పాకిస్తాన్‌ తరపున 19 టెస్టుల్లో 76 వికెట్లు, 28 వన్డేల్లో 53 వికెట్లు, 30 టీ20ల్లో 32 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: ఆ క్రికెటర్‌తోనే నా కూతురు పెళ్లి: పాక్‌ మాజీ క్రికెటర్‌

CPL 2021: షెఫర్డ్‌ అద్భుత స్పెల్‌..  సూపర్‌ ఓవర్‌లో థ్రిల్లింగ్‌ విక్టరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement