ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. గత మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లో 'గోల్డెన్ డక్' అయిన సుదర్శన్.. ఈమ్యాచ్‌లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు.
ఈ తమిళనాడు క్రికెటర్ ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. తొలి రెండు ఓవర్లు కాస్త ఆచితూచి ఆడిన సుదర్శన్, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 58 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుదర్శన్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. సుదర్శన్‌కు ఇది మూడో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం.
ఈ క్రమంలో సాయిసుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్‌లు పరంగా అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా సాయి సుదర్శన్ రికార్డులెక్కాడు. అతడు కేవలం 47 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(48 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో అభిషేక్ శర్మ(1193) అగ్రస్ధానంలో ఉన్నాడు.
బంతులు పరంగా అత్యంతవేగంగా 2000 పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీరే
1193 - అభిషేక్ శర్మ
1211 - వీరేంద్ర సెహ్వాగ్
1306 - రిషబ్ పంత్
1326 - యశస్వి జైస్వాల్
1353 - యూసుఫ్ పఠాన్
1361 - సాయి సుదర్శన్
Krunal Pandya ಅವರ ಬೌನ್ಸರ್ ಎಸೆತಕ್ಕೆ Sai Sudharsan ಅಟ್ಟಿದ ಭರ್ಜರಿ ಸಿಕ್ಸರ್!😱🔥
ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #RCBvsGT | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL pic.twitter.com/0BTEiT4tnC— Star Sports Kannada (@StarSportsKan) April 24, 2026


