South Africa Boxer Induced Coma: ప్రత్యర్థి పంచ్‌కు బాక్సర్‌కు ఊహించని అనుభవం; ఆపై కోమాలోకి

SA-Boxer Simiso Buthelezi Induced Coma After Boxing During Title Fight - Sakshi

బాక్సింగ్‌ రింగ్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ప్రత్యర్థి పంచ్‌లకు బ్రెయిన్‌లో ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ అవడంతో మరొక బాక్సర్‌ కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలోకి వెళ్లే కొద్ది క్షణాల ముందు.. అతను ప్రవర్తించిన తీరు ఉద్వేగానికి గురి చేసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే..  లైట్ వెయిట్ బాక్సర్లు సిమిసో బుటెలేజీ, సిప్సిలే నుంటుగ్వాల మధ్య జూన్‌ 5న(ఆదివారం) వరల్డ్‌ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆల్‌ ఆఫ్రికా లైట్‌ వెయిట్‌ బాక్సింగ్‌ టైటిల్‌ పోరు జరిగింది. ఇద్దరు మంచి టఫ్‌ ఫైట్‌ కనబరచడంతో పోరు ఆసక్తికరంగా సాగింది.


10వ రౌండ్‌ బౌట్‌ మొదలయ్యే వరకు సిమిసో, నుంగుట్వాలు ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. పదో బౌట్‌ మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు నుంటుగ్వా ఇచ్చిన పంచ్‌ సిమిసో బుటెలేజీ తలలో బలంగా తగిలింది. దీంతో కళ్లు బైర్లు కమ్మిన సిమిసోకు ఏం చేస్తున్నాడో ఒక్క క్షణం ఎవరికి అర్థం కాలేదు. రిఫరీ ఉన్న వైపు దూసుకొచ్చిన సిమిసో బుటెలేజీ అతనికి పంచ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన ప్రత్యర్థి వెనకాల ఉంటే.. అది గమనించకుండా తన ముందువైపు ఎవరు లేనప్పటికి గాలిలో పంచ్‌లు కొట్టే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన రిఫరీ సిమిసో పరిస్థితిని అర్థం చేసుకొని బౌట్‌ను నిలిపేసి మెడికోను పిలిచాడు. దీంతో సిప్సిలే నుంటుగ్వా లైట్‌వెయిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌గా అవతరించాడు.


వైద్య సిబ్బంది సిమిసోను పరిశీలించి వెంటనే డర్బన్‌లో కింగ్‌ ఎడ్వర్డ్‌-8 ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన సిమిసో బెటెలేజీ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బ్రెయిన్‌లో ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ అవడంతో కోమాలో ఉన్నాడని.. రెండురోజులు గడిస్తే కానీ పరిస్థితి ఏంటి అనేది ఒక అంచనాకు వస్తుందని వైద్యులు తెలిపారు. అయితే కొద్దిరోజుల్లోనే అతను మాములు పరిస్థితికి వచ్చేస్తాడని.. ప్రాణాలకు ఏం భయం లేదని తెలిపారు.. కాగా సిమిసో బాక్సింగ్‌ రింగ్‌లో ఫైట్‌ చేసిన ఆఖరి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్‌ బాక్స్‌ విసిరేసిన క్రికెట్‌ అభిమాని

Rabat Diamond League 2022: అవినాశ్‌ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top