అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్‌.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్‌ | Rohit Sharma Loses His Cool After Controversial Dismissal Of Jaiswal | Sakshi
Sakshi News home page

IPL 2023: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్‌.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్‌

May 1 2023 12:31 PM | Updated on May 1 2023 3:12 PM

Rohit Sharma Loses His Cool After Controversial Dismissal Of Jaiswal - Sakshi

PC: twitter

ఐపీఎల్‌ 1000వ మ్యాచ్‌ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్‌ మజా అందించింది. ఐపీఎల్‌-2023లో భాగంగా వాంఖడే వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా..  ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన ప్రశాంతతను కోల్పోయాడు. ఫీల్డ్‌ అంపైర్‌తో రోహిత్‌ వాగ్వాదానికి దిగాడు.

ఏం జరిగిందంటే?
రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ 20 ఓవర్‌లో అర్షద్‌ ఖాన్‌ వేసిన ఫుల్‌ టాస్‌ బంతిని యశస్వి జైశ్వాల్‌ భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాకపోవడంతో బంతి పిచ్‌ మధ్యలో గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బౌలర్‌ అర్షద్‌ ఖాన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే బంతి బ్యాటర్‌కు కొంచెం ఎత్తుగా వెళ్లడంతో ఫీల్డ్‌ అంపైర్లు అది ఏమైనా నో బాలా అన్న డౌట్‌తో థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించారు.

థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేయడం రోహిత్‌ శర్మకు చిరాకు తెప్పించింది. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆటగాళ్లు వైడ్, నో బాల్ నిర్ణయాలను సమీక్షించుకునే ఛాన్స్‌ ఉంది. అయినప్పటికీ అంపైర్‌ రిఫర్‌ చేయడంతో హిట్‌మ్యాన్‌ కోపంతో ఊగిపోయాడు. అంపైర్‌ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు.

ఆఖరికి థర్డ్‌ అంపైర్‌ కూడా ఔట్‌గా ప్రకటించాడు. దీంతో రోహిత్‌ కాస్త కూలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.  ఓవరాల్‌గా జైశ్వాల్‌ 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు.
చదవండిIPL 2023: వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. అతడొక అద్భుతం: సంజూ శాంసన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement