
Rohit Sharma-KL Rahul Most Century Partnership In T20Is Ind Vs NZ: టి20 క్రికెట్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు అరుదైన ఘనత సాధించారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్- రాహుల్ జోడి సెంచరీ భాగస్వామ్యంతో మెరిసింది. ఈ జంట టి20ల్లో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఐదోసారి. 27 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్- రాహుల్ జంట ఐదుసార్లు ఘనత సాధించారు. ఓవరాల్‌గా 22 ఇన్నింగ్స్‌లో బాబర్ అజమ్- రిజ్వాన్ జంట తొలి స్థానంలో ఉన్నారు. ఇక రోహిత్- రాహుల్ జంట ఐదుసార్లు(27 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో, గప్టిల్- విలియమ్సన్ జంట నాలుగు సార్లు(30 ఇన్నింగ్స్‌లు), రోహిత్- ధావన్ జంట నాలుగు సార్లు(52 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. ఇక రోహిత్ శర్మ టి20ల్లో 13 సార్లు వంద సెంచరీల భాగస్వామ్యంలో పాల్గొన్నాడు. బాబర్ అజమ్.. మార్టిన్ గప్టిల్ 12 సార్లు.. డేవిడ్ వార్నర్ 11 సార్లు సెంచరీ భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నారు.