Asia Cup 2022 IND VS PAK: టీమిండియా ఓపెనర్లు ఎవరు.. ? ఆసక్తికర సమాధానమిచ్చిన హిట్‌మ్యాన్‌

Rohit Sharma Cheeky Reply To Pakistani Journalists Who Will Open With You Question - Sakshi

Rohit Sharma: పాకిస్థాన్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 28) జరుగనున్న హై ఓల్టేజీ మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్‌ జోడీ ఎవరనే అంశంపై పాక్‌ జర్నలిస్ట్‌ వ్యంగ్యంగా అడిగిన ప్రశ్నను తనదైన శైలిలో సమాధానమిస్తూ హుషారుగా కనిపించాడు.    

వివరాల్లోకి వెళితే.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా భారత ఓపెనింగ్ జోడిపై పాక్ జర్నలిస్ట్ హిట్‌మ్యాన్‌ను వ్యంగ్యంగా ప్రశ్నించాడు. గత కొంతకాలంగా టీమిండియా ఓపెనర్లను వరుసగా మారుస్తూ వస్తుంది. ఈ మ్యాచ్‌తోనైనా ఆ ప్రయోగాలకు పుల్‌స్టాప్‌ పెడతారా..? లేక అదే ధోరణిని కంటిన్యూ చేస్తారా..? అని సదరు విలేకరి రోహిత్‌ను అడిగాడు. 

ఇందుకు హిట్‌మ్యాన్‌ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. తొందరెందుకు.. టాస్‌ వేశాక మీరే చూస్తారుగా అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. కొన్ని విషయాలు సీక్రెట్‌గా ఉండడం తమ జట్టుకు అవసర​మంటూ కంక్లూడ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 
చదవండి: ప్రపంచ రికార్డుకు 10 పరుగుల దూరంలో హిట్‌మ్యాన్‌

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top