
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. చేతి వేలి గాయం కారణంగా ఫీల్డింగ్‌కు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్.. తిరిగి బ్యాటింగ్‌కు రానున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చేందుకు పంత్ ప్యాడ్స్ కట్టుకుని సిద్దంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా తొలి రోజు ఆట సందర్భంగా బుమ్రా బౌలింగ్‌లో పంత్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆట మధ్యలోనే మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆటలో కూడా పంత్ ఫీల్డింగ్ రాలేదు. అతడి స్దానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన పంత్..
అయితే రెండో రోజు ఆట ఆరంభానికి ముందు రిషబ్ పంత్.. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్, ఫిజియో యోగేష్ పర్మార్ పర్యవేక్షణలో ద్దరు త్రోడౌన్ స్పెషలిస్టులతో కలిసి పంత్ నెట్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్బంగా అతడు కాస్త ఆసౌక్యర్యంగా కన్పించాడు.
ఇంకా అతడికి ఇంకా పూర్తిగా చేతి వేలి నొప్పి తగ్గనట్లు తెలుస్తోంది. అయినప్పటికి జట్టు అవసరం దృష్ట్యా అతడు బ్యాటింగ్‌కు రావాలని అతడి నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు.