Team India Head Coach: కుంబ్లే వద్దన్నాడు.. టీమిండియాకు కొత్త విదేశీ కోచ్‌!

Reports BCCI Likely Recruit Foreign Coach Team India Kumble Not Interest - Sakshi

Foreign Head Coach For Team India.. టి20 ప్రపంచకప్‌ 2021 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌ పదవి ఎవరిని వరించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోచ్‌ పదవికి సంబంధించి టి20 ప్రపంచకప్‌ అనంతరం దరఖాస్తులు కోరనుంది. కాగా  రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్లు ముందుగా తెరపైకి రాగా ఆ తర్వాత అనిల్‌ కుంబ్లేకి టీమిండియా కోచ్‌ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపినట్లు సమాచారం.

చదవండి: టీమిండియా ప్రధాన కోచ్‌గా మరోసారి ఆయనే!

తాజాగా బీసీసీఐ మరో కొత్త ప్రతిపాధనను తెరమీదకు తీసుకువచ్చింది. అనిల్‌ కుంబ్లే టీమిండియా కోచ్‌ పదవికి ఆసక్తి చూపించడం లేదని.. గంగూలీ ఒక్కడే కుంబ్లే కోచ్‌గా రావాలని అడిగినట్లు బీసీసీఐ ప్రతినిధి అనధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం బోర్డు సభ్యులకు నచ్చకపోవడంతో గంగూలీ ఆ ఆలోచనను విరమించుకునే అవకాశం ఉందని.. అందుకే టీమిండియాకు విదేశీ కోచ్‌ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనికోసం బీసీసీఐ ఇప్పటికే పలువురు విదేశీ కోచ్‌లను సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే బీసీసీఐ ఎవరిని సంప్రదించిదనే వివరాలపై స్పష్టత లేదు.

అంతేగాక ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే పనితనం అనుకున్నంత సజావుగా లేదు. అతని పర్యవేక్షణలో పంజాబ్‌ కింగ్స్‌ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతుంది. కుంబ్లే ఇప్పటికే తనకు కోచ్‌ పదవిపై ఆసక్తి లేదని అనధికారికంగా పేర్కొన్నప్పటికీ.. బహిరంగంగా మాత్రం ఐపీఎల్‌లో పంజాబ్‌ను సరిగా నడిపించలేకపోతున్నాడు.. ఇక టీమిండియాను ఎలా నడిపిస్తాడని బీసీసీఐ సభ్యులు గంగూలీ ఎదుట పేర్కొన్నట్లు సమాచారం. ఇక వివిఎస్‌ లక్ష్మణ్‌ కూడా కోచ్‌ పదవి చేపట్టే అవకాశాలు దాదాపు లేనట్లే. అందుకే బీసీసీఐ విదేశీ కోచ్‌పై ఆసక్తి చూపిస్తుందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. 

చదవండి: Sunil Gavaskar: రానున్న రెండు వరల్డ్‌కప్‌లకు అతడే కెప్టెన్‌గా ఉండాలి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top