SA Vs IND: "అశ్విన్‌కి లాటరీ తగిలింది.. ఇది ఒక కొత్త జీవితం"

Reetinder Singh Sodhi feels Ravi Ashwins ODI comeback is a new lifeline for him - Sakshi

భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌  దాదాపు నాలుగేళ్ల తరువాత వన్డేల్లో పునరాగమనం  గమనం చేయనున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టులో అశ్విన్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ రీతీందర్ సింగ్ సోధీ అసక్తికర వాఖ్యలు చేశాడు. అశ్విన్‌ లాటరీ గెలుచుకున్నాడని అతడు అభిప్రాయపడ్డాడు. అశ్విన్‌కి ఇది ఒక కొత్త జీవితం అని అతడు తెలిపాడు.

"అశ్విన్‌కి లాటరీ తగిలింది. అతడి కెరీర్ దాదాపు ముగిసిందని.. అశ్విన్‌ రిటైర్మెంట్‌ కూడా  ప్రకటించడానికి కూడా సిద్దమయ్యాడు. అటువంటి సమయంలో అతడికి ఒక కొత్త జీవితం వచ్చింది. అశ్విన్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటాడని భావిస్తున్నాను. అతడు ఒక స్పిన్‌ దిగ్గజం. అతడికి ఈ ఫార్మాట్‌లో చాలా అనుభవం ఉంది. రాహుల్ ద్రవిడ్, టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు అతడి  అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపికచేశారు. దక్షిణాఫ్రికా పర్యటన అంత సులభమైనది కాదు, కాబట్టి  సెలెక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు అని సోధీ పేర్కొన్నాడు.

చదవండి: Sourav Ganguly: మరోసారి కోవిడ్‌ బారిన పడిన బీసీసీఐ బాస్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top