తండ్రైన ఆర్సీబీ కెప్టెన్‌ | RCB rejoices as Rajat Patidar blessed with a child | Sakshi
Sakshi News home page

IPL 2026: తండ్రైన ఆర్సీబీ కెప్టెన్‌

Mar 20 2026 1:04 PM | Updated on Mar 20 2026 1:26 PM

RCB rejoices as Rajat Patidar blessed with a child

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ రజిత్ పాటిదార్ తొలిసారి తండ్రయ్యాడు. అతడి భార్య గుంజన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను పాటిదార్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

దీంతో పాటిదార్ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా యాదృచ్చికంగా ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ కూడా గురువారమే ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అంతేకాకుండా డికే, పాటిదార్ బర్త్‌డేలు కూడా ఒకే రోజు కావడం విశేషం.

ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన పాటిదార్‌ను ఆర్సీబీ  గతేడాది తమ జట్టు కెప్టెన్‌గా నియమించింది. అయితే కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే ట్రోఫీని అందించి.. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆర్సీబీని మరోసారి విజేతగా నిలపాలని పాటిదార్ ఉవ్విళ్లూరుతున్నాడు.

బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ శిబరాన్ని నిర్వహిస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి జట్టుతో చేరాడు. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. అయితే ఈ ఏడాది సీజన్‌కు ముందు ఆర్సీబీని గాయల బెడద వెంటాడుతోంది. స్టార్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్‌, నువాన్ తుషారా అందుబాటుపై ఇంకా క్లారిటీ లేదు.
చదవండి: IPL 2026: 'గొప్ప క్రికెటరేమి కాదు.. అతడికెందుకు రూ.25 కోట్లు'

Advertisement
 
Advertisement
Advertisement