IPL 2022 Auction: ఐపీఎల్ వేలంలో హైద‌రాబాద్ సీపీ కూమారుడు.. ఏ జ‌ట్టు ద‌క్కించుకుందంటే

RCB buy Hyderabad CP CV Anand Son Chama Milind for 25 lakhs - Sakshi

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు 2022 ఐపీఎల్‌ సీజన్‌ కోసం మిలింద్‌ను రూ. 25 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (2015), ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (2016) జట్లకు హైదరాబాద్‌ క్రికెటర్‌ సీవీ మిలింద్‌ ఎంపికయ్యాడు. ఎడంచేతివాటం పేస్‌ బౌలర్‌ మిలింద్‌ 2013 నుంచి హైదరాబాద్‌ జట్టు తరఫున రంజీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ, ముస్తాక్‌ అలీ ట్రోఫీ టోర్నీలలో ఆడుతూ నిలకడగా రాణిస్తున్నాడు.

 మిళింద్ లిస్ట్-ఏలో 45 మ్యాచ్‌లు ఆడి 82 వికెట్లను పడగొట్టాడు. 20 ఏళ్ల చామ మిళింద్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు.  ఇక‌ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడే ఈ చామ మిళింద్ ఆనంద్.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top