
PC: IPL.com
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ యువ సంచలనం, హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులతో అదరొట్టిన తిలక్.. ముంబై తొలి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాదీ.. 147 పరుగులతో ముంబై తరపున టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
ఇక మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న తిలక్‌వర్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ హైదారాబాదీని పొగడ్తలతో ముంచెత్తాడు. తిలక్ వర్మ అతి త్వరలోనే భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని రవిశాస్త్రి జోస్యం చెప్పాడు.
"తిలక్ వర్మ రూపంలో భారత జట్టుకు మరో యువ సంచలనం దొరికాడు. అతడు ఇప్పటికే టీమిండియా ఆటగాడిగా భావిస్తున్నాను. తిలక్ మరో ఐదు-ఆరు నెలలో టీమిండియా తరపున ఆడకపోతే.. అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా వర్మకు ఉంది. ప్రస్తుతం అతడికి కేవలం 20 ఏళ్ల వయస్సు మాత్రమే. ఈ వయస్సులో అతడు ఆడుతున్న ఆటతీరు గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముంబైకే కాకుండా భారత జట్టుకు అతడు అద్భుతాలు సృష్టిస్తాడు" అని స్టార్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండి: #Tilak Varma: ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న హైదరాబాదీ.. టీమిండియా ఎంట్రీ ఖాయం!