Mayank Agarwal: డబుల్‌ సెంచరీతో చెలరేగిన మయాంక్‌ అగర్వాల్‌

Ranji Trophy: Mayank Agarwal Hits Double Century KAR Vs SAU Semi Final - Sakshi

టీమిండియాకు దూరమైన మయాంక్‌ అగర్వాల్‌ రంజీ క్రికెట్‌లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న సెమీఫైనల్లో ఈ కర్ణాటక కెప్టెన్‌  గురువారం డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. 626 నిమిషాల పాటు క్రీజులో గడిపిన మయాంక్‌ 429 బంతులెదుర్కొని 249 పరుగులు చేశాడు. మయాంక్‌ ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.

ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్‌ కాగా అందులో మయాంక్‌వే 249 పరుగులు ఉండడం విశేషం. ఒక రకంగా అతనిది వన్‌మ్యాన్‌ షో అని చెప్పొచ్చు. ఇక శ్రీనివాస్‌ శరత్‌ 66 పరుగులతో సహకరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్‌ సకారియా, కె పటేల్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. చిరాగ్‌ జానీ, ప్రేరక్‌ మన్కడ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన సౌరాష్ట్ర వికెట్‌ నష్టానికి 22 పరుగులు చేసింది.

బెంగాల్‌ వర్సెస్‌ మధ్యప్రదేశ్‌, రంజీ రెండో సెమీఫైనల్‌
బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. అనుస్తుప్‌ మజుందార్‌ (120 పరుగులు), సుదీప్‌ గరామీ(112 పరుగులు) శతకాలతో చెలరేగగా.. వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పోరెల్‌ 51 పరుగులు చేశాడు. అనంతరం మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసింది.

చదవండి: Ravindra Jadeja: పాంచ్‌ పటాకా.. ఆటతో పాటు తీరు కూడా కొత్తగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top