సెమీస్‌లో రామ్‌కుమార్‌ | Ramkumar Ramanathan beats Donskoy to make Eckental Challenger semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో రామ్‌కుమార్‌

Nov 7 2020 5:46 AM | Updated on Nov 7 2020 5:46 AM

Ramkumar Ramanathan beats Donskoy to make Eckental Challenger semis - Sakshi

న్యూఢిల్లీ: ఎకెంటల్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 206వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 6–2, 6–1తో ప్రపంచ 120వ ర్యాంకర్, నాలుగో సీడ్‌ ఎవ్‌గెనీ డాన్‌స్కాయ్‌ (రష్యా)ను ఓడించాడు. 57 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ 11 ఏస్‌లు సంధించడం విశేషం. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన రామ్‌కుమార్‌ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో మార్విన్‌ మోలెర్‌ (జర్మనీ)తో రామ్‌కుమార్‌ ఆడతాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement