IND VS SA: లక్నోలో భారీ వర్షం.. తొలి వన్డేపై నీలినీడలు

Rain likely to disrupt 1st OD IND vs SA - Sakshi

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పడు మరో పోరుకు సిద్దమైంది. స్వదేశంలో ప్రోటీస్‌ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే లక్నో వేదికగా గురువారం(ఆక్టోబర్‌ 6)న జరగనుంది. కాగా రోహిత్‌ సారథ్యంలో భారత సీనియర్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2022 కోసం ఆస్ట్రేలియాకు పయనం కావడంతో.. ద్వితీయ శ్రేణి జట్టును భారత సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఇక ఈ ద్వితీయ శ్రేణి జట్టు వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్నాడు. కాగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. గురువారం మ్యాచ్‌ జరిగే సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్యూవెదర్ తెలిపింది.

మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం రావడానికి 50 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది అని అక్యూవెదర్ పేర్కొంది. కాగా గత రెండు రోజుల నుంచి లక్నోలో భారీ వర్షాలు కురిస్తున్నాయి. ప్రస్తుతం పిచ్‌ మొత్తం కవర్లతో కప్పబడి ఉంది. 
మ్యాచ్‌ అరగంట ఆలస్యం
వర్షం కారణంగా భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే అరగంట ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ట్విట్‌ చేసింది. కాగా 1:00 గంటకు టాస్‌ పడాల్సి ఉండగా.. ఇప్పడు 1: 30కు పడనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.
తుది జట్లు(అంచనా)
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), జాన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి
చదవండి: AUS vs ENG: ఇంగ్లం‍డ్‌తో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా! స్టార్‌ ఆటగాళ్లు దూరం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top