మాట నిలబెట్టుకున్న ప్రధాని.. పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీం

Pm Narendra Modi Fulfils Promise Has Ice Cream With Pv Sindhu - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముందుగా తాను చెప్పినట్లుగానే.. తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధుతో కలిసి ఐస్ క్రీం తిన్నారు. స్వాంత్రంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిన్న ఎర్ర‌కోటకు ఆథ్లెట్ల‌ను ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. అనంతరం మోదీ తన నివాసంలో ఒలింపిక్స్‌ అథ్లెట్స్ కి ఆతిథ్యం ఇచ్చారు. వారు చేసిన కృషిని అభినందించారు.. వారి విజయాలను ప్రశంసించారు. భారత అథ్లెట్స్ కి ఒలింపిక్స్‌ కి వెళ్లడానికి మందు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

కాగా.. ఆ సమయంలో వారందరి వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలను మోదీ తెలుసుకున్నారు. ప‌త‌కంతో తిరిగి వ‌చ్చాక ఐస్‌క్రీమ్ తిందామ‌ని సింధుతో చెప్పిన ఆయన.. దాని ప్రకారమే నేడు సింధు తో క‌లిసి ప్ర‌ధాని ఐస్‌క్రీమ్ తిన్నారు. టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింట‌న్‌లో గెలుచుకున్న బ్రాంజ్‌ మెడల్‌ తో పాటు.. గ‌తంలో రియో ఒలింపిక్స్‌లో సాధించిన ప‌త‌కాన్ని కూడా ఈ సంద‌ర్భంగా సింధు త‌న వెంట తీసుకెళ్లింది. ఆ రెండింటిని ధ‌రించి.. ప్ర‌ధాని మోదీతో క‌లిసి ఆమె ఫోటో దిగింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top