‘పతకాలే కాదు హృదయాలు గెలిచారు’

India 75th independence day: PM Narendra Modi hails India Olympic stars - Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికెత్తారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ సారి పతక విజేతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి అద్భుతమైన ప్రదర్శన దేశంలోని యువతకు స్ఫూర్తినిచి్చందని ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల ప్రదర్శన చూసి భారత్‌ గరి్వస్తోంది. అథ్లెట్లు పతకాలే కాదు హృదయాల్ని గెలిచారు. యువతకు ప్రేరణగా నిలిచారు. ఇక్కడికొచి్చన అతిథులు, దేశంలోని ప్రజలంతా ఈ సంద ర్భంగా వారికి జేజేలు పలకాలి’ అని మోదీ అన్నారు. ఈ వేడుకల్లో పతక విజేతలు నీరజ్‌ చోప్రా, సింధు, మీరాబాయి, లవ్లీనా, రవి, బజరంగ్, పురుషుల హాకీ జట్టు సభ్యులతో పాటు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇతర ప్లేయర్లు పాల్గొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top