IPL 2022: 'అతడి కెప్టెన్సీలో ఆడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నా'

Playing under Mayank will be good for me Says Shikhar Dhawan - Sakshi

ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తొలి సారి పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో ధావన్‌ని రూ.8.25 కోట్లకు పంజాబ్‌ కొనుగోలు చేసింది. కాగా పంజాబ్‌ కింగ్స్‌కు సారథిగా ధావన్‌ ఎంపిక అవుతాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ ఎంపికయ్యాడు. 

ఈ క్రమంలో యంగ్‌ ఎండ్‌ డైనిమిక్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ నేతృత్వంలో ఆడేందకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని ధావన్‌ తెలిపాడు. "మయాంక్‌ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నాను. అతడి కెప్టెన్సీలో ఆడడం నాకు బాగా ఉపయోగపడుతుంది. మాకు బలమైన జట్టు ఉంది. జట్టులో చాలా మంది ప్రతిభావంతులైన యువకులు ఉన్నారు. ఈ సారి మేము అద్భుతాలు సృష్టిస్తాం. అదే విధంగా మయాంక్‌తో ఓపెనింగ్‌ చేసే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నాను. ఓపెనింగ్‌ ఆనేది పెద్ద బాధ్యతతో కూడుకున్న పని, దానిని స్వీకరించడానికి నేను సిద్దంగా ఉన్నాను.

నేను ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్నాను. త్వరలోనే జట్టులో చేరుతాను. ఇక్కడ నెట్స్‌లో నేను తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇకపై నా ఆటపై మాత్రమే దృష్టి సారిస్తాను. టీమిండియా నుంచి పిలుపు వస్తే వెంటనే జట్టులో చేరడానికి సిద్దంగా ఉన్నాను. దాని కోసమే ఎదరుచూస్తున్నాను" అని ధావన్‌ పేర్కొన్నాడు. కాగా గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన ధావన్‌ 587 పరుగులు సాధించి అద్భుతంగా రాణించాడు.

చదవండి: WI Vs Eng 2nd Test- Joe Root: జో రూట్‌ అరుదైన సెంచరీ.. దిగ్గజాలను వెనక్కి నెట్టి..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top