కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!

Pat Cummins Trolled After Giving 49 Runs In 3 Overs Against Mumbai Indians - Sakshi

అబుదాబి : 2019 డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ను రూ. 15 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక బౌలర్‌కు అన్ని కోట్లు ఇవ్వడం ఇదే మొదటిసారి. అయితే ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా బుధవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. 3ఓవర్లలోనే 4 సిక్సులు, మూడు ఫోర్లు సమర్పించుకొని 49 పరుగులు ఇచ్చేశాడు. తొలి స్పెల్‌లో 5వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన కమిన్స్‌ను రోహిత్‌ ఒక ఆట ఆడుకున్నాడు. కమిన్స్‌ ఆ ఓవర్లో షార్ట్‌​ బాల్స్‌ సంధించగా.. రోహిత్‌ రెండు బారీ సిక్స్‌లు బాదాడు. (చదవండి : సిక్స్‌లతో రెచ్చిపోయిన రోహిత్‌.. ముంబై స్కోరెంతంటే)

15వ ఓవర్లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన కమిన్స్‌ను ఈసారి సౌరబ్‌ తివారి ఆడుకున్నాడు. ఈ ఓవర్‌లో తివారి ఒక సిక్స్‌, ఫోర్‌తో మొత్తం 15 పరుగులు రాబట్టాడు. ఇక 17వ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా వంతు వచ్చింది.. కమిన్స్‌ వేసిన ఆ ఓవర్లో హార్దిక్‌ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 19 రన్స్‌ పిండుకున్నాడు. అయితే కమిన్స్‌ బ్యాటింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. బుమ్రా వేసిన ఒక ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టిన కమిన్స్‌ మొత్తం 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 12 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. కానీ కమిన్స్‌ను ఒక స్టార్‌ బౌలర్‌గానే చూసిన కోల్‌కతా అతని నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం పట్ల కాస్త నిరాశకు లోనైంది.  

టెస్టుల్లో నెంబర్‌ 1 బౌలర్‌గా ఉన్న కమిన్స్‌ నిన్న జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లలోనే 49 పరుగులు ఇచ్చి ఒక చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు.  2011 ఐపీఎల్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇదే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్మీపతి బాలాజీ 3 ఓవర్లలోనే 51 పరుగులు ఇచ్చి ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఆటగాడిగా చెత్త రికార్డు నమోదు చేశాడు. బాలాజీ తర్వాత 49 పరుగులు ఇచ్చిన కమిన్స్‌ జైదేవ్‌‌ ఉనాద్కట్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు.(చదవండి : ఏడు సీజన్‌ల తర్వాత ‘తొలి’ ఓటమి)

 మ్యాచ్‌ ముగిసిన అనంతరం కమిన్స్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. 'కమిన్స్‌.. కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా ఆడితే ఎలా' అంటూ పేర్కొన్నారు. అయితే మరికొందరు మాత్రం కమిన్స్‌కు మద్దతు ఇచ్చారు.' కమిన్స్‌కు ఈ ఐపీఎల్‌లో ఇది మొదటి మ్యాచ్‌ మాత్రమే.. రానున్న రోజుల్లో తన మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసే అవకాశం ఉందంటూ ' పలువురు పేర్కొన్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (28 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిశారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

23-11-2020
Nov 23, 2020, 14:53 IST
ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా 1800 మందికి...
19-11-2020
Nov 19, 2020, 17:11 IST
టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం కేఎల్‌ రాహుల్‌ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు.
17-11-2020
Nov 17, 2020, 18:58 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) ఘోరపరాభవం పొందిన విషయం తెలిసిందే. 2011లో తన స్కిల్స్‌తో టీమిండియాకు ప్రపంచ కప్‌...
15-11-2020
Nov 15, 2020, 19:37 IST
రెండున్నర నెలలపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి బీసీసీఐ భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ...
12-11-2020
Nov 12, 2020, 20:06 IST
టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు భారీ షాక్‌ తగిలింది.
12-11-2020
Nov 12, 2020, 05:02 IST
ప్రతీ ఐపీఎల్‌కు ఒక కథ ఉంటుంది... ఈ సారి ఐపీఎల్‌ది అన్నింటికంటే భిన్నమైన కథ... కరోనా ఐపీఎల్‌ను ఆపేస్తుందని అంతా...
11-11-2020
Nov 11, 2020, 12:25 IST
అభిమానులు రవిశాస్త్రి తీరును ఎండగట్టారు. కావాలనే దాదాపేరును ప్రస్తావించలేదని తిట్టిపోస్తున్నారు.
11-11-2020
Nov 11, 2020, 10:26 IST
బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా నా పని. అందరూ బాగా...
11-11-2020
Nov 11, 2020, 08:43 IST
కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్, హెడ్‌ కోచ్‌గా అనిల్‌ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్‌ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు.
11-11-2020
Nov 11, 2020, 04:26 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ అప్రతిహత జైత్రయాత్ర... ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యమైన ఆటతీరును కనబర్చిన ఈ జట్టు...
10-11-2020
Nov 10, 2020, 22:55 IST
దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌  మళ్లీ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. వేదిక ఏదైనా టైటిల్‌ వేటలో తమకు...
10-11-2020
Nov 10, 2020, 21:19 IST
దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 157 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది....
10-11-2020
Nov 10, 2020, 19:59 IST
దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ బౌల్ట్‌ తొలి...
10-11-2020
Nov 10, 2020, 19:10 IST
దుబాయ్‌: ఈ సీజన్‌ ఐపీఎల్‌ టైటిల్‌ కోసం ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాలుగు టైటిల్స్‌ గెలిచిన ముంబై...
10-11-2020
Nov 10, 2020, 18:24 IST
కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెట్‌ అభిమానులకు అసలైన మజా ఇస్తున్న ఐపీఎల్‌ చివరి దశకు చేరుకుంది. నేటి ఫైనల్‌...
10-11-2020
Nov 10, 2020, 17:17 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పలువురు యువ క్రికెటర్లు సత్తాచాటిన సంగతి తెలిసిందే, వారిలో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లైన సూర్యకుమార్‌...
10-11-2020
Nov 10, 2020, 16:10 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి పాలైంది. లీగ్‌ దశలో...
10-11-2020
Nov 10, 2020, 10:58 IST
ఫిట్‌నెస్‌, ప్రాక్టిస్‌కు సంబంధించి ఎంతగా శ్రమించాల్సి వస్తుందో తెలిజేసే వీడియో అది.
10-11-2020
Nov 10, 2020, 05:02 IST
ఐపీఎల్‌ అసలు 2020లో జరుగుతుందా అనే సందేహాలను దాటి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా 52 రోజుల పాటు...
09-11-2020
Nov 09, 2020, 22:16 IST
దుబాయ్‌: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టులో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top