బాయ్‌.. బయోబబూల్‌లో ఉన్నాం మర్చిపోయావా

Pakistan Wicket Keeper Hilarious Comment While Azhar Ali Chases cat - Sakshi

రావల్పిండి: పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్‌ వికెట్‌కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తన సహచర ఆటగాడు అజర్‌ అలీని ట్రోల్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. ఆటలో నాలుగోరోజైన ఆదివారం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో ఒక పిల్లి మైదానంలోకి పరిగెత్తుకు వచ్చింది. పిల్లిని చూసిన అజర్‌ అలీ దానిని గ్రౌండ్‌ నుంచి బయటికి పంపడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన రిజ్వాన్‌.. అజ్జూ బాయ్‌.. మనం బయోబబూల్‌లో ఉన్నాం.. అది(పిల్లి) లేదు.. ముందు దానికి కరోనా టెస్టు నిర్వహించి ఆ తర్వాత బయటికి పంపు అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. రిజ్వాన్‌ వ్యాఖ్యలు విన్న పాక్‌ ఆటగాళ్లు నవ్వును ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఇస్మాయిల్‌ ఫారుక్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా రెండో టెస్టులో​ విజయం సాధించాలంటే ఇంకా 243 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఒక వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. మక్రమ్‌ 59, వాన్‌డర్‌ డస్సెన్‌ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌటైంది. 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు క్రితం రోజు స్కోరుతో నాలుగోరోజు ఆటను ఆరంభించిన పాక్‌ మహ్మద్‌ రజ్వాన్‌ సెంచరీతో( 115, 204 బంతులు; 15 ఫోర్లు) మెరవడంతో 298 పరుగులకు ఆలౌటై దక్షిణాఫ్రికా ముందు 370 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. సోమవారం ఆటకు ఆఖరిరోజు కావడం.. తొలి ఇన్నింగ్స్‌ హీరో హసన్‌ అలీ మరోసారి బౌలింగ్‌తో రెచ్చిపోతే ప్రొటీస్‌ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. కాగా ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన పాకిస్తాన్‌ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top