Sakshi News home page

263 పరుగులకే ఆలౌటైన ఐర్లాండ్‌..  అయినా 108 పరుగుల ఆధిక్యం

Published Thu, Feb 29 2024 4:44 PM

Only Test With Afghanistan: Ireland All Out For 263 In First Innings - Sakshi

అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్‌ పైచేయి సాధించింది. ఈ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే ఆలౌటైనా.. 108 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. 

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో వెటరన్‌ ఆటగాడు పాల్‌ స్టిర్లింగ్‌ (52) అర్దసెంచరీతో రాణించగా.. కర్టిస్‌ క్యాంఫర్‌ (49), లోర్కాన్‌ టక్కర్‌ (46), ఆండీ మెక్‌బ్రైన్‌ (38), హ్యారీ టెక్టార్‌ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్లు మూర్‌ (12), బల్బిర్నీ (2), వాన్‌ వోర్కోమ్‌ (1), అదైర్‌ (15), మెక్‌కార్తీ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 

ఐర్లాండ్‌ పతనాన్ని శాశించిన రెహ్మాన్‌..
ఆఫ్ఘన్‌ బౌలర్లలో జియా ఉర్‌ రెహ్మాన్‌ (5/64) ఐర్లాండ్‌ పతనాన్ని శాశించగా.. నవీద్‌ జద్రాన్‌ 3, నిజత్‌ మసూద్‌, జహీర్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్‌ చేసిన 53 పరుగులే ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్‌గా ఉంది. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ కరీం జనత్‌ (41 నాటౌట్‌), కెప్టెన్‌ హష్మతుల్లా షాహీది (20), నవీద్‌ జద్రాన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

ఐదేసిన అదైర్‌..
రహ్మత్‌ షా (0), రహ్మానుల్లా గుర్బాజ్‌ (5), నసీర్‌ జమాల్‌ (0), జియా ఉర్‌ రెహ్మాన్‌ (6), నిజత్‌ మసూద్‌ (0), జహీర్‌ ఖాన్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. మార్క్‌ అదైర్‌ (5/39) ఆఫ్ఘనిస్తాన్‌ పతనాన్ని శాశించగా.. కర్టిస్‌ క్యాంఫర్‌, క్రెయిగ్‌ యంగ్‌ తలో 2 వికెట్లు, బ్యారీ మెక్‌కార్తీ ఓ వికెట్‌ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు కావడం మరో విశేషం.   
 

Advertisement

What’s your opinion

Advertisement