వైరల్‌ వీడియో : చిన్నారి అభిమానికి రాకెట్‌ బహుమానం..!

Novak Djokovic Gives His Racquet To A Young Fan After Wimbledon Win Video Viral - Sakshi

లండన్‌: ఈ ఏడాది తన అద్వితీయ ఆటతీరు కొనసాగిస్తూ సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆరోసారి చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వింబుల్డన్ గెలిచిన తరువాత జొకోవిచ్ ఓ చిన్నారి అభిమానికి తన రాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. స్టేడియంలోని చిన్నారి పట్టుకున్న ఓ పోస్టర్‌లో నోవాక్ జొకోవిచ్ పేరుతో పాటు.. అత్యుత్తమ, విజయవంతమైన, ప్రతిష్టాత్మక ప్రపంచ నెంబర్‌1 అని రాసి ఉంది.

వింబుల్డన్  అధికారిక హ్యాండిల్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా.. "అందమైన చిన్నారి" అంటూ సోమవారం జొకోవిచ్ షేర్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3.2 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. అలాగే 2.32 లక్షల మంది లైక్‌  కొట్టగా.. వేలమంది కామెంట్‌ చేశారు.  దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ..‘‘ అందుకే జొకోవిచ్‌ వింబుల్డన్‌ నెం1 ఆటగాడయ్యాడు.’’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇక ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 3 గంటల 24 నిమిషాల్లో 6–7 (4/7), 6–4, 6–4, 6–3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ బెరెటిని (ఇటలీ)పై  గెలుపొందాడు. తద్వారా తన కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top