అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును తిరగరాసిన ఆఫ్ఘాన్‌ బౌలర్‌

Noor Ahmad Became Youngest Cricketer To Bag Man Of The Match Award - Sakshi

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో ఆఫ్ఘాన్‌ యువ బౌలర్‌ నూర్‌ అహ్మద్‌ చరిత్ర తిరగరాశాడు. ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 17 ఏళ్ల నూర్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో (4/10) జట్టును విజయపథంలో నడిపించడంతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ అయిన నూర్‌ 17 ఏళ్ల 162 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. ఆఫ్ఘాన్‌కే చెందిన రహ్మానుల్లా గుర్భాజ్‌ 17 ఏళ్ల 354 రోజుల్లో, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్‌ అమీర్‌ 18 ఏళ్ల 84 రోజుల్లో అంతర్జాతీయ టీ20ల్లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నారు. 

ఇదిలా ఉంటే, ఆతిధ్య జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో నూర్‌, అష్రాఫ్‌ (2/13) చెలరేగడంతో పర్యాటక ఆఫ్ఘానిస్థాన్‌ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘానిస్థాన్‌ 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా.. ఛేదనలో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. అంతకుముందు జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా ఆఫ్ఘానిస్థాన్‌ 3-0 తేడాతో వైట్‌వాష్‌ చేసింది.
చదవండి: మరో శతకం దిశగా దూసుకెళ్తున్న క్రీడా మంత్రి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top