Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో!

అబుదాబి టీ10 లీగ్‌లో దక్కన్ గ్లాడియేటర్స్ బోణీ కొట్టింది. టీమ్ అబుదాబితో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది.
అబుదాబి బ్యాటర్లలో జెమ్స్ విన్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక గ్లాడియేటర్స్ బౌలింగ్‌లో జహూర్ ఖాన్, హెల్మ్ తలా రెండు వికెట్లు సాధించగా.. షమ్సీ, లిటిల్ చెరో వికెట్ పడగొట్టారు.
పూరన్ విధ్వంసం
ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్కన్ గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గ్లాడియేటర్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు ఓడియన్ స్మిత్ 23 పరుగులతో రాణించాడు. టీమ్ అబుదాబి బౌలర్లలో పీటర్ హట్జోగ్లూ, అలెన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ టోర్నీ ఆరంభానికి ముందు రోజే వెస్టిండీస్ కెప్టెన్సీకి నికోలస్ పూరన్ రాజీనామా చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
The Grind is on.
The Gladiators⚔️ are ready.
It's gonna be EPIC💥!#CricketsFastestFormat @T10League🏆#DeccanPhirJeetaga🏆 #AbuDhabiT10 #Season6 #InAbuDhabi #DeccanGladiators #HumHaiDakshin #deccanagain #heretowin pic.twitter.com/JNd1P9stIQ
— Deccan Gladiators (@TeamDGladiators) November 23, 2022
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం
సంబంధిత వార్తలు