New York Mets Pete Alonso Breaks His-Bat In Half After Getting Out - Sakshi
Sakshi News home page

Pete Alonso : వామ్మో కట్టెముక్కను విరిచినట్లు.. బ్యాట్‌ను సింపుల్‌గా

Jun 26 2022 1:52 PM | Updated on Jun 26 2022 2:54 PM

New York Mets Pete Alonso Breaks His-Bat In Half After Getting Out - Sakshi

మనుషులకు కోపం సహజం. అందులో కొంతమంది కోపాన్ని తట్టుకోవడం కష్టం. కోపంలో ఉన్న వ్యక్తి తనకు ఏది ఎదురుపడితే దానిని విరిచేయడమో లేక పగులగొట్టడమో చేస్తుంటారు. తాజాగా బేస్‌బాల్‌ ఆటలో తాను ఔటయ్యాననే కోపంలో బ్యాట్‌ను రెండు ముక్కలు చేసిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదో కట్టెముక్కును విరగొట్టినట్లుగా సింపుల్‌గా బ్యాట్‌ను విరిచేయడం ఆసక్తిగా మారింది.

విషయంలోకి వెళితే.. న్యూయార్క్‌ మెట్స్‌, మియామి మార్లిన్స్‌ మధ్య బేస్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూయార్క్‌ మెట్స్‌ 5-3 తేడాతో మియామి మార్లిన్స్‌పై విజయం అందుకుంది. అయితే మ్యాచ్‌ విజయం కంటే న్యూయార్క్‌ మెట్స్‌ స్టార్‌ పీట్ అలోన్సో చర్య ఎక్కువ హైలైట్‌ అయింది. 8వ ఇన్నింగ్స్‌లో పీట్‌ అలోన్సో షాట్‌ ఆడే ప్రయత్నంలో ఔట్‌ అయ్యాడు. కీలక సమయంలో ఔటయ్యానన్న బాధ పీట్‌ అలోన్సో కళ్లలో స్పష్టంగా కనిపించింది. అంతే ఉగ్రంగా మారిపోయిన పీట్‌.. ఏదో కట్టెముక్కను విరిచేసిట్లు బ్యాట్‌ను తొడ బాగంలో పెట్టుకొని సింపుల్‌గా రెండు ముక్కలు చేసి పారేశాడు. దీనికి సంబంధించిన వీడియోపై మీరు ఒక లుక్కేయండి.

చదవండి: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం

రోహిత్‌ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్‌ కాదనుకుంటే రహానే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement