
సిడ్నీ : నిన్న ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం చెందటానికి విరాట్ కోహ్లి నాయకత్వలేమే కారణమంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ‘‘రవి శాస్త్రిని ముందు టీంనుంచి బయటకు పంపాలి. కోహ్లి, శాస్త్రి కాంబినేషన్‌లో మనం ఏ కప్పునూ గెలవలేము’’ ... ‘‘ టీం ఇండియా తన బ్రాండ్ మార్చుకోవాలనుకుంటే, రవిశాస్త్రిని తీసేసి ఫారెన్ కోచ్ లేదా మంచి కోచ్‌ను తీసుకురావాలి. కోహ్లితో శాస్త్రి ఇక వద్దు’’ ... ‘‘ చిన్న నోరు పెద్ద మాట.. కోహ్లి కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పాలి. బ్యాటింగ్ మీద శ్రద్ధ చూపాలి. టెండూల్కర్ లాగా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ‘అది జరిగితే మాత్రం ఏడాదంతా సంబరాలే’ )
వీరితో మాజీ క్రికెట్ ఆటగాడు గౌతమ్ గంభీర్ జతకలిశారు. కోహ్లి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను గెలిచిన ఆసీస్.. ఆదివారం నాటి రెండో వన్డేలో కూడా విజయం సాధించింది. ఆసీస్ 51 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.