Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి'

Netizens Slam Riyan Parag What He-Specialised Poor Show IPL 2022 Final - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ ఆటతీరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ తరపున వ్యర్థమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రియాన్‌ పరాగేనని క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు. అసలు సీజన్‌లో పరాగ్‌ది ఏ రోల్‌ అనేది(ఉదా: బ్యాటింగ్‌, బౌలర్‌, ఆల్‌రౌండర్‌) క్లారిటీ లేదని తెలిపారు. గత సీజన్‌లో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లతో పేరు పొందిన రియాన్‌ పరాగ్‌.. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో సూపర్‌గా రాణిస్తాడని అంతా భావించారు.


PC: IPL Twitter
కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 15 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క అర్థశతకంతో 183 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పరాగ్‌ బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. బట్లర్‌ విఫలమయ్యాడు.. ప్రధాన బ్యాటర్స్‌ అంతా అప్పటికే వెనుదిరిగారు. ఇక క్రీజులో ఉన్న రియన్‌ పరాగ్‌ ఒక స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అనుకుంటే కనీసం రాజస్తాన్‌ పోరాడే స్కోరు  అందించినా బాగుండేది. అలా జరగకపోగా.. చివరి వరకు నిలిచిన పరాగ్‌ 15 బంతుల్లో ఒక ఫోర్‌ సాయంతో 15 పరుగులు చేసి చివరి బంతికి ఔటయ్యాడు. అతని కంటే బౌల్ట్‌, మెకాయ్‌లు చాలా నయం.. ఎందుకుంటే వాళ్లిదరు రెండు సిక్సర్లు బాది 19 పరుగులు జత చేసి వెళ్లారు.

ఇక గత సీజన్‌లో మంచి స్ట్రైక్‌రేట్‌ కలిగిన పరాగ్‌.. తన చెత్త ఆటతీరుతో ఈ సీజన్‌లో అశ్విన్‌ తర్వాత బ్యాటింగ్‌కు రావడం అతని పరిస్థితిని తెలియజేస్తుంది. ఇంత ఘోరంగా విఫలమైనప్పటికి సంజూ శాంసన్‌ పరాగ్‌కు ఇన్ని అవకాశాలు ఎందుకు ఇచ్చాడనేది ప్రశ్నార్థకమే. దీనికి తోడూ పరాగ్‌ క్యాచ్‌ పట్టినా.. రనౌట్‌ చేసినా.. బ్యాటింగ్‌లో ఫోర్‌ లేదా సిక్సర్‌ బాదిన.. అతను చేసే ఓవర్‌ యాక్షన్‌ తట్టుకోవడం అభిమానులకు కష్టంగా మారింది. రియాన్‌ పరాగ్‌పై వచ్చిన ఫన్నీ ట్రోల్స్‌పై ఒక లుక్కేయండి.

ఇక ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చివరి వరకు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. 2008 తర్వాత మరోసారి ఫైనల్‌ చేరిన రాజస్తాన్‌ రెండోసారి కప్‌ కొట్టబోతుందని చాలా మంది అభిమానులు భావించారు. అయితే ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఫేలవ ప్రదర్శనతో ఓటమిపాలై రెండోసారి టైటిల్‌ కొట్టాలన్న కలను నెరవేర్చుకోలేకపోయింది. అయితే ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఒక మ్యాచ్‌ గెలిచింది అంటే ఆ మ్యాచ్‌లో బట్లర్‌ మెరుపులు మెరిపించాడు అనేంతలా పేరొచ్చింది. ఎందుకంటే రాజస్తాన్‌ బ్యాటింగ్‌లో బట్లర్‌ ఒక ఎత్తు అయితే.. మిగతావారు మరొక ఎత్తు. జట్టుకు బట్లర్‌ బలం.. అతనే బలహీనత. మొత్తానికి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ వచ్చే సీజన్‌లోనైనా కప్‌ కొడుతుందేమో చూడాలి.

చదవండి: Trolls On GT IPL 2022 Win: 'ఊహించిందే జరిగింది.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ గట్రా.. ఏమి లేవుగా?!'

IPL 2022 Winner: క్రెడిట్‌ మొత్తం ఆయనకేనన్న హార్దిక్‌.. అంతా అబద్ధం! కాదు నిజమే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top