విండీస్‌కు నెదర్లాండ్స్‌ షాక్‌.. సూపర్‌ ఓవర్‌! 30 పరుగులతో బౌలర్‌ విధ్వంసం | Netherlands Shocks West Indies In Thrilling Super Over Van Beek Heroics | Sakshi
Sakshi News home page

విండీస్‌కు నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమి.. సూపర్‌ ఓవర్‌! 30 పరుగులతో బౌలర్‌ సంచలనం! తేజ సెంచరీ మరువొద్దు!

Jun 26 2023 9:41 PM | Updated on Jun 26 2023 9:50 PM

Netherlands Shocks West Indies In Thrilling Super Over Van Beek Heroics - Sakshi

 ICC Cricket World Cup Qualifiers 2023: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో వెస్టిండీస్‌కు నెదర్లాండ్స్‌ ఊహించని షాకిచ్చింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో తొలుత స్కోరు సమం చేసిన డచ్‌ జట్టు.. సూపర్‌ ఓవర్లో సంచలన విజయం సాధించింది. నెదర్లాండ్స్‌ బౌలర్‌ లోగన్‌ వాన్‌ బీక్‌ సూపర్‌ ఓవర్లో వరుసగా 4,6,4,6,6,4 బాది సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు.

పూరన్‌ అజేయ సెంచరీ వృథా
హరారే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో విండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (76), చార్ల్స్ (54) అర్ధ శతకాలతో శుభారంభం అందించారు.

కెప్టెన్‌ షాయీ హోప్‌ 47 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నికోలస్‌ పూరన్‌ 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో కీమోపాల్‌ మెరుపు ఇన్నింగ్స్‌(25 బంతుల్లో 46 పరుగులు) ఆడాడు. దీంతో విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 374 పరుగులు చేసింది.

తేజ నిడమనూరు సెంచరీ
ఇక లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ ఆదిలో కాస్త తడబడినా.. ఆంధ్ర మూలాలున్న బ్యాటర్‌ తేజ నిడమనూరు అద్భుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. 76 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ (67) రాణించాడు. చివర్లో లోగన్‌ వాన్‌ బీక్‌(28), ఆర్యన్‌ దత్‌ (16) మెరుపులు మెరిపించగా ఇరు జట్ల స్కోరు సమమైంది.

వీరవిహారం చేసిన బౌలర్‌
ఈ క్రమంలో మ్యాచ్‌ టై కాగా సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాన్ బీక్‌ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. అంతేకాదు బంతితోనూ మ్యాజిక్‌ చేశాడు. 32 ఏళ్ల ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ బౌలింగ్‌లో చార్ల్స్ తొలుత సిక్సర్‌ కొట్టగా.. రెండో బంతికి హోప్‌ ఒక పరుగు తీశాడు.

అయితే, ఆ మరుసటి రెండు బంతుల్లో వాన్‌ బీక్‌.. చార్ల్స్, హోల్డర్‌లను వరుసగా అవుట్‌ చేశాడు. ఈ క్రమంలో విజయం నెదర్లాండ్స్‌ సొంతమైంది.  దీంతో విండీస్‌కు పసికూన చేతిలో ఊహించిన షాక్‌ తగిలినట్లయింది. వాన్‌ బీక్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే క్వాలిఫయర్స్‌లో గ్రూప్‌-ఏలో ఉన్న జింబాబ్వే, నెదర్లాండ్స్‌, వెస్టిండీస్‌ ఇప్పటికే సూపర్‌ సిక్సెస్‌కు చేరుకున్నాయి.    

చదవండి: అమెరికాలో.. దిగ్గజ క్రికెటర్లతో సంజూ శాంసన్‌! ఫొటో వైరల్‌
ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్‌ కూల్‌ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement