
National Tennis Championship- Shrivalli Rashmikaa: జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రష్మిక 6–1, 6–0తో ఆయూషి సింగ్ (బిహార్)పై విజయం సాధించింది. ఇక హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల, తటవర్తి శ్రేయ కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నిధి 6–3, 6–2తో సాయిదేదీప్యపై, శ్రేయ 6–2, 6–3తో ప్రతిభా నారాయణ్‌పై గెలిచారు.
చదవండి: T20 WC 2021 IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు
T20 World Cup 2021: భారత్ పై విజయం.. ఇప్పుడు పాకిస్తానే టైటిల్ ఫేవరెట్