
‘ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. సుదీర్ఘకాలం పాటు క్రికెటర్‌గా కొనసాగడం గర్వంగా ఉంది. దేశానికి, రాష్ట్రానికి ఆడడం నా కల దాన్ని పూర్తి చేశా ’ అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. భారత క్రికెట్ జట్టులో సీనియర్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా ఉన్న నమన్ ఓజా రిటైర్మెంట్ ప్రకటించాడు.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో సీనియర్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా ఉన్న నమన్ ఓజా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల ఓజా దేశం తరఫున మూడు ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఒక టెస్టు, ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. ‘ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. సుదీర్ఘకాలం పాటు క్రికెటర్‌గా కొనసాగడం గర్వంగా ఉంది. దేశానికి, రాష్ట్రానికి ఆడడం నా కల దాన్ని పూర్తి చేశా ’ అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన వెన్నంటే ఉన్న వారు ఓదార్చారు.
2000లో క్రికెట్‌లోకి ప్రవేశించిన ఓజా 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 17 ఏళ్ల వయసప్పుడు 2000-01లో ఓజా మధ్యప్రదేశ్ తరఫున క్రికెట్ రంగ ప్రవేశం చేశాడు. ఆ సమయంలోనే మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి రావడంతో ఓజాకు అవకాశాలు రాలేదు. ఐపీఎల్‌లో ఓజా ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు.
- మధ్యప్రదేశ్ నుంచి నరేంద్ర హిర్వానీ తర్వాత టెస్టు క్రికెట్ ఆడిన రెండో ఆటగాడు ఓజానే.
- 2010లో జింబాబ్వే పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఓజా ఎంపికయ్యాడు.
- 2015లో శ్రీలంకతో కొలంబో వేదికగా టెస్టు మ్యాచ్ ఆడాడు.
- 20 సీజనల్లో దేశవాళీ క్రికెట్‌లో ఓజా నిలకడగా ఆడాడు. అయితే జాతీయ జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు.
#Indian international cricket player Naman Ojha announced his retirement. He was worst in tears while announced his retirement from international cricket. pic.twitter.com/yciKLXBiEX
— Govind Gurjar (@govindtimes) February 15, 2021