ముంబై వేట.. ఆరో సారి ఫైనల్‌కు

Mumbai Indians beat Delhi Capitals by 57 runs - Sakshi

తొలి క్వాలిఫయర్‌లో ముంబై జయభేరి

57 పరుగులతో ఓడిన ఢిల్లీ 

చెలరేగిన ఇషాన్, హార్దిక్‌ 

నిప్పులు చెరిగిన బుమ్రా, బౌల్ట్‌

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై టైటిల్‌ వేటలో పడితే ఆ ఆట రూటే వేరని మరోసారి నిరూపించింది. తొలి క్వాలిఫయర్‌లో రోహిత్‌ సేన ఢిల్లీని ఒక ఆటాడుకుంది. కసిదీరా బ్యాట్‌తో, బంతితో వెంటాడింది. విజయంతో ఫైనల్‌కు బాట వేసుకుంది. 13 సీజన్ల ఐపీఎల్‌ చరిత్రలో ఆరోసారి ముంబై ఫైనల్లోకి ప్రవేశించింది. రోహిత్‌ సేన బ్యాటింగ్‌కు చెల్లాచెదురైన ఢిల్లీ బౌలింగ్‌... ప్రత్యర్థి బౌలింగ్‌ మొదలుకాగానే విలవిలలాడింది. అయ్యర్‌ సేన ఇప్పుడు ఫైనల్‌ కోసం మరో పోరాటం చేయాల్సి వుంది.

దుబాయ్‌: ముంబై క్వాలిటీ‘ఫైట్‌’ ముందు ఢిల్లీ భీతిల్లింది. ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్ల విజేత ముంబై ఇండియన్సే మరో ఫైనల్స్‌కు సిద్ధమైంది. తొలి క్వాలిఫయర్‌లో ఎదురు పడిన ఢిల్లీని చితగ్గొట్టి, పడగొట్టి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది.

ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్‌ యాదవ్‌ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్‌; 5 సిక్సర్లు) విధ్వంస రచన చేశాడు. వీరి ప్రతాపానికి అశ్విన్‌ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. స్టొయినిస్‌ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బుమ్రా (4/14) పొట్టి ఫార్మాట్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.  

డికాక్‌ ధనాధన్‌తో మొదలై...
టాస్‌ నెగ్గిన ఢిల్లీ బౌలింగ్‌ ఎంచుకుంది. ముంబై ఆట ధాటిగా మొదలైంది. ఫోర్‌తో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన డికాక్‌ తొలి ఓవర్లో 3 బౌండరీలు బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే కెప్టెన్‌ రోహిత్‌ (0) డకౌటయ్యాడు. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్‌ వేగంగా పరుగులు జతచేశాడు. నోర్జే, రబడా బౌలింగ్‌లను ఇద్దరు అవలీలగా ఎదుర్కొన్నారు. ఫోర్లు, సిక్సర్లతో రన్‌రేట్‌ను అమాంతం పెంచేశారు. సగటున ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సాగిపోతున్న ముంబైకి మళ్లీ అశ్వినే షాకిచ్చాడు. డికాక్‌ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌)ను పెవిలియన్‌ చేర్చాడు.  
సూర్య, ఇషాన్‌ ఫిఫ్టీ–ఫిఫ్టీ
ఆ తర్వాత కూడా 10 ఓవర్ల దాకా ముంబై 93/2 స్కోరుతో పటిష్టంగా ఉంది. కానీ తర్వాత ఓవర్లలో వేగం మారి వికెట్ల పతనం ముంబై జోరును కిందకు దించింది. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ బౌండరీతో అర్ధసెంచరీ (36 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పూర్తి చేసుకున్నాడు. నోర్జే వేసిన ఈ ఓవర్లో తను మరో షాట్‌కు ప్రయత్నించి లాంగ్‌ లెగ్‌లో సామ్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 100 పరుగుల వద్ద మూడో వికెట్‌ పడింది. ఆ తర్వాతి ఓవర్లో అశ్విన్‌ మరో దెబ్బ తీశాడు. ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ పొలార్డ్‌ (0)ను కూడా ఖాతా తెరవనీయలేదు.

వచ్చీ రాగానే షాట్‌ ఆడిన ఈ హిట్టర్‌... లాంగాన్‌లో రబడ క్యాచ్‌ పట్టడంతో నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో రన్‌రేట్‌ పూర్తిగా మందగించింది. 11వ ఓవర్‌ నుంచి 14వ ఓవర్‌ వరకు ముంబై చేసింది 15 పరుగులే కాగా... విలువైన 2 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్‌ కిషన్‌ బ్యాట్‌ ఝళిపించడంతో ముంబై ఇన్నింగ్స్‌ రాకెట్‌ వేగం అందుకుంది. రబడా వేసిన 15వ ఓవర్‌ వరుస బంతుల్లో ఇషాన్‌ మిడ్‌వికెట్‌ దిశగా బౌండరీ, డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టాడు. నోర్జే వేసిన మరుసటి ఓవర్లో ఇషాన్‌ 2 ఫోర్లు, కృనాల్‌ పాండ్యా సిక్సర్‌ బాదాడు. దీంతో ముంబై ఈ రెండు ఓవర్లలో 32 పరుగులు రాబట్టింది.

హార్దిక్‌ సిక్సర్లు
కాసేపటికే కృనాల్‌ (13)ను స్టొయినిస్‌ ఔట్‌ చేసినా... సోదరుడు హార్దిక్‌ పాండ్యా ఆలస్యం చేయకుండానే ఇషాన్‌ కిషన్‌ను అనుసరించాడు. సామ్స్‌ 18వ ఓవర్లో ఇద్దరు చెరో సిక్సర్‌ బాదడంతో 17 పరుగులొచ్చాయి. రబడా 18వ ఓవర్‌ను హార్దిక్‌ చితగ్గొట్టాడు. తొలి బంతిని లాంగాన్‌లో భారీ సిక్సర్‌ బాదిన అతను మిడ్‌వికెట్‌ మీదుగా ఫ్లాట్‌ సిక్స్‌ కొట్టాడు. ఈ ఓవర్లోనూ 18 పరుగులు రావడంతో ముంబై స్కోరు 180కి చేరింది. పాండ్యా ఆఖరి ఓవర్లో నోర్జేను ఆడుకున్నాడు. అతను 2 సిక్సర్లు కొడితే ఇషాన్‌ కిషన్‌ మరో సిక్సర్‌ బాదాడు. దీంతో 20 పరుగులు రావడంతో ముంబై స్కోరు 200 పరుగులకు చేరింది. ఆఖరి 6 ఓవర్లలో ముంబై కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 92 పరుగులు సాధించడం విశేషం.

ఢిల్లీ 0, 0, 0...
కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ బ్యాటింగ్‌ మొదలు పెట్టగానే కుదేలైంది. ఓపెనర్లు, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఇలా టాపార్డర్‌ ఖాతానే తెరువకుండా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన బౌల్ట్‌ రెండో బంతికి పృథ్వీ షా(0)ను, ఐదో బంతికి రహానే (0)ను డకౌట్‌ చేశాడు. 0కే 2 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్‌ను బుమ్రా మరో దెబ్బ తీశాడు. ధావన్‌ (0)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. పరుగు చేయకుండానే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఒక్కసారిగా సాగిలపడిపోయింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (12) కూడా ఎక్కువసేపు నిలువకుండా బుమ్రానే పెవిలియన్‌ చేర్చాడు. రిషబ్‌ పంత్‌ (3)ను కృనాల్‌ పాండ్యా ఔట్‌ చేశాడు. దీంతో ఢిల్లీ 41 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది.

స్టొయినిస్‌ అర్ధసెంచరీ
ఇక చేయాల్సిన లక్ష్యానికి జట్టు దూరమైన సమయంలో స్టొయినిస్, అక్షర్‌ పటేల్‌ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగారు. ఇద్దరు క్రీజులో నిలిచాక ధాటిగా ఆడటం మొదలుపెట్టారు. అక్షర్‌ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ను తలపించేలా ఆడగా... స్టొయినిస్‌ తన సహజసిద్ధమైన ఆటతో ఆకట్టుకున్నాడు. అతను 36 బంతుల్లో ఫిఫ్టీ (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటక బుమ్రా... స్టొయినిస్‌ ఆట కట్టించాడు. అద్భుతమైన డెలివరీతో అతని బౌల్డ్‌ చేశాడు. రెండు బంతుల వ్యవధిలోనే సామ్స్‌ (0)ను కూడా కీపర్‌ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. దీంతో అక్షర్‌ పటేల్‌ మెరుపులు 20 ఓవర్ల కోటా పూర్తిచేసేందుకు    పనికొచ్చాయి. బుమ్రాకు దీటుగా చక్కని స్పెల్‌       వేసిన    బౌల్ట్‌ (2–1–9– 2) గాయంతో తన కోటా పూర్తిచేయలేకపోయాడు.   

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) ధావన్‌ (బి) అశ్విన్‌ 40; రోహిత్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 0; సూర్య కుమార్‌ (సి) స్యామ్స్‌ (బి) నోర్జే 51; ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 55; పొలార్డ్‌ (సి) రబడ (బి) అశ్విన్‌ 0; కృనాల్‌ (సి) స్యామ్స్‌ (బి) స్టొయినిస్‌ 13; హార్దిక్‌ (నాటౌట్‌) 37; ఎక్స్‌ట్రా లు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200.  
వికెట్ల పతనం: 1–16, 2–78, 3–100, 4–101, 5–140.  
బౌలింగ్‌: స్యామ్స్‌ 4–0–44–0, అశ్విన్‌ 4–0–29–3, రబడ 4–0–42–0, అక్షర్‌ 3–0–27–0, నోర్జే 4–0–50–1, స్టొయినిస్‌ 1–0–5–1.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 0; ధావన్‌ (బి) బుమ్రా 0; రహానే (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 0; శ్రేయస్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) బుమ్రా 12; స్టొయినిస్‌ (బి) బుమ్రా 65; పంత్‌ (సి) సూర్య కుమార్‌ (బి) కృనాల్‌ 3; అక్షర్‌ (సి) చహర్‌ (బి) పొలార్డ్‌ 42; స్యామ్స్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 0; రబడ (నాటౌట్‌) 15; నోర్జే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143.  
వికెట్ల పతనం: 1–0, 2–0, 3–0, 4–20, 5–41, 6–112, 7–112, 8–141.
బౌలింగ్‌: బౌల్ట్‌ 2–1–9–2, బుమ్రా 4–1–14–4, కృనాల్‌ 4–0–22–1, కూల్టర్‌నైల్‌ 4–0–27–0, పొలార్డ్‌ 4–0–36–1, రాహుల్‌ చహర్‌ 2–0–35–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-05-2021
May 07, 2021, 11:05 IST
న్యూఢిల్లీ: ఇటీవల ఆటగాళ్లకి కరోనా వైరస్‌ సోకడంతో అనూహ్యంగా ఐపీఎల్‌ 2021 ని బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, ఆటగాళ్లను బయోబబుల్‌లో...
04-04-2021
Apr 04, 2021, 19:54 IST
ముంబై: ఐపీఎల్‌-14వ సీజన్‌ ఇంకా మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం...
31-01-2021
Jan 31, 2021, 01:31 IST
ముంబై: ఐపీఎల్‌–2021ను నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్‌...
05-01-2021
Jan 05, 2021, 14:47 IST
ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ అజిత్‌ సింగ్‌ ధ్రువీకరించారు.
21-12-2020
Dec 21, 2020, 14:23 IST
మన రాష్ట్రంలో 41 శాతం మంది మాత్రమే దీని ఆరా తీశారు. తెలంగాణలో మన కంటె ఒక్క శాతం ఎక్కువ...
23-11-2020
Nov 23, 2020, 14:53 IST
ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా 1800 మందికి...
19-11-2020
Nov 19, 2020, 17:11 IST
టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం కేఎల్‌ రాహుల్‌ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు.
17-11-2020
Nov 17, 2020, 18:58 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) ఘోరపరాభవం పొందిన విషయం తెలిసిందే. 2011లో తన స్కిల్స్‌తో టీమిండియాకు ప్రపంచ కప్‌...
15-11-2020
Nov 15, 2020, 19:37 IST
రెండున్నర నెలలపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి బీసీసీఐ భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ...
12-11-2020
Nov 12, 2020, 20:06 IST
టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు భారీ షాక్‌ తగిలింది.
12-11-2020
Nov 12, 2020, 05:02 IST
ప్రతీ ఐపీఎల్‌కు ఒక కథ ఉంటుంది... ఈ సారి ఐపీఎల్‌ది అన్నింటికంటే భిన్నమైన కథ... కరోనా ఐపీఎల్‌ను ఆపేస్తుందని అంతా...
11-11-2020
Nov 11, 2020, 12:25 IST
అభిమానులు రవిశాస్త్రి తీరును ఎండగట్టారు. కావాలనే దాదాపేరును ప్రస్తావించలేదని తిట్టిపోస్తున్నారు.
11-11-2020
Nov 11, 2020, 10:26 IST
బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా నా పని. అందరూ బాగా...
11-11-2020
Nov 11, 2020, 08:43 IST
కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్, హెడ్‌ కోచ్‌గా అనిల్‌ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్‌ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు.
11-11-2020
Nov 11, 2020, 04:26 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ అప్రతిహత జైత్రయాత్ర... ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యమైన ఆటతీరును కనబర్చిన ఈ జట్టు...
10-11-2020
Nov 10, 2020, 22:55 IST
దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌  మళ్లీ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. వేదిక ఏదైనా టైటిల్‌ వేటలో తమకు...
10-11-2020
Nov 10, 2020, 21:19 IST
దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 157 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది....
10-11-2020
Nov 10, 2020, 19:59 IST
దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ బౌల్ట్‌ తొలి...
10-11-2020
Nov 10, 2020, 19:10 IST
దుబాయ్‌: ఈ సీజన్‌ ఐపీఎల్‌ టైటిల్‌ కోసం ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాలుగు టైటిల్స్‌ గెలిచిన ముంబై...
10-11-2020
Nov 10, 2020, 18:24 IST
కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెట్‌ అభిమానులకు అసలైన మజా ఇస్తున్న ఐపీఎల్‌ చివరి దశకు చేరుకుంది. నేటి ఫైనల్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top