గొయెంకా-రాహుల్‌ వివాదంపై స్పందించిన షమీ | Mohammed Shami Sends Shockwaves, Justifies Sanjiv Goenka Act With KL Rahul | Sakshi
Sakshi News home page

గొయెంకా-రాహుల్‌ వివాదంపై స్పందించిన షమీ

Apr 1 2026 7:10 PM | Updated on Apr 1 2026 7:41 PM

Mohammed Shami Sends Shockwaves, Justifies Sanjiv Goenka Act With KL Rahul

లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా, ఆ ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మధ్య ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో జరిగిన సంఘటనపై ఆ ఫ్రాంచైజీ తాజా రిక్రూటీ మహ్మద్‌ షమీ స్పందించాడు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, గోయెంకాను సమర్థించాడు.

షమీ మాటల్లో.. గొయెంకా గారిని రెండు, మూడు సార్లు కలిశాను. ఎప్పుడూ చాలా లాజికల్‌గా, జట్టు గురించి మాత్రమే మాట్లాడారు. తన జట్టుపై పొజెసివ్‌గా ఉంటే తప్పేముంది. పెట్టుబడి పెట్టాక, ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు ఆశించడం సహజం. తమ డబ్బు వృథా అవుతుందేమో అని ఎవరైనా ఆందోళన చెందుతారు.

వివాదం  నేపథ్యం
ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘోర పరాజయం పాలైంది. 165 పరుగుల లక్ష్యాన్ని SRH కేవలం 9.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. మ్యాచ్‌ అనంతరం గోయెంకా మైదానంలో అందరూ చూస్తుండగా కేఎల్‌ రాహుల్‌ను దండించాడు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో బాగా వైరల్‌ అయ్యాయి. 

ఎంత యజమాని అయితే మాత్రం, ఓ కెప్టెన్‌ను అలా పబ్లిక్‌గా విమర్శించడం సరైంది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు భిన్నంగా షమీ స్పందించడం చర్చనీయాంశమైంది.

ఎల్‌ఎస్‌జీలోకి షమీ
ఐపీఎల్‌ 2026కి ముందు షమీ SRH నుంచి LSGకి ట్రేడ్‌ అయ్యాడు. SRH ఆయనను IPL 2025లో రూ.10 కోట్లకు కొనుగోలు చేయగా.. అదే ధరకు LSG అతన్ని ట్రేడ్‌ చేసుకుంది. ఐపీఎల్‌ 2013లో కేకేఆర్‌ తరఫున అరంగేట్రం చేసిన షమీ.. Delhi Capitals, Punjab Kings, Gujarat Titans, SRH తరఫున ఆడాడు. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున అతను 2022, 2023 సీజన్లలో వరుసగా 20, 28 వికెట్లు తీశాడు.  

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2026లో ఎల్‌ఎస్‌జీ ఇవాళ (ఏప్రిల్‌ 1) తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. లక్నోలోని ఎఖానా స్టేడియంలో Delhi Capitals‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో షమీ LSG తరఫున తొలి సారి ఆడబోతున్నాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement