WPL 2023: గుజరాత్‌ జెయింట్స్‌ మెంటార్‌గా మిథాలీ రాజ్‌ 

Mithali Raj Roped Mentor-Advisor For WPL Team Gujarat Giants - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో అహ్మదాబాద్‌ జట్టు ‘గుజరాత్‌ జెయింట్స్‌’కు భారత మాజీ కెపె్టన్‌ మిథాలీ రాజ్‌ మెంటార్‌గా వ్యవహరించనుంది. మిథాలీ లాంటి స్టార్‌ను తమ  బృందంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని డైరెక్టర్‌ ప్రణవ్‌ అదానీ చెప్పారు. డబ్ల్యూపీఎల్‌ కోసం ఆమె రిటైర్మెంట్‌ను పక్కన పెట్టి తొలి టోర్నీలో ఆడవచ్చని వినిపించింది. అయితే తాజా ప్రకటనతో  మిథాలీ ప్లేయర్‌గా ఆడే అవకాశాలు లేవని తేలిపోయింది.  

గుజరాత్​లో విమెన్స్​ క్రికెట్​ను అభివృద్ధి చేసేందుకు.. మెంటార్​గా మిథాలీ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ అందించనుంది. మార్చిలో జరిగే డబ్ల్యూపీఎల్​లో ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. గత వారం జరిగిన ఫ్రాంచైజీల వేలంలో అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌  రూ. 1298 కోట్లతో గుజరాత్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. విమెన్స్​ క్రికెట్​ డెవలప్​కావడానికి బీసీసీఐ తీసుకున్న చొరవ చాలా బాగుందని మిథాలీ కితాబిచ్చింది. యంగ్​స్టర్స్​ క్రికెట్​ను ప్రొఫెషన్​గా తీసుకునేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top