
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌తో తలపడ్డ యోధుడు అతడు.. ఐదుసార్లు బ్రిటిష్ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ గెలిచిన వీరుడు.. అంతేకాదు నాలుగుసార్లు కామన్‌వెల్త్ చాంపియన్‌గా నిలిచిన ఘనత అతడిది.. కానీ ఇప్పుడు ఓ ఈవెంట్లో బౌన్సర్..
ఆ బాక్సింగ్ చాంపియన్ పేరు జూలియస్ ఫ్రాన్సిస్ (Julius Francis). కాగా టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charana) మైనపు విగ్రహాన్ని ఇటీవలే.. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కుటుంబంతో సహా చెర్రీ హాజరయ్యాడు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ తన అభిమానులను కలిసేందుకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో బౌన్సర్ల బృందంలో బ్రిటిష్ హెవీవెయిట్ చాంపియన్ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ కూడా కనిపించడం విశేషం.

అంతేకాదు.. ఫ్రాన్సిస్ తన బాక్సింగ్ బెల్టును తీసుకుని రామ్ చరణ్ దగ్గరికి వచ్చి.. దానిని తన భుజం చుట్టూ వేయాల్సిందిగా కోరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎవరీ జూలియస్ ఫ్రాన్సిస్?
1993- 2006 మధ్య జూలియస్ ఫ్రాన్సిస్ ప్రొపెఫషనల్ బాక్సర్‌గా ఉన్నాడు. 2000 సంవత్సరంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌తో తలపడ్డ అతడు.. ఓటమి చవిచూశాడు. అరవై ఏళ్ల జూలియస్ ఓవరాల్‌గా తన కెరీర్‌లో 23 విజయాలు సాధించి.. ఇరవై నాలుగింటిలో ఓడిపోయాడు.

ఇక 2007లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ బౌట్‌లోనూ జూలియస్ ఫ్రాన్సిస్ పాల్గొన్నాడు. 2012లో నటనా రంగంలోనూ అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2022లో యూకేలో ఓ రెస్టారెంట్ బయట ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు అభిమానులతో ఓ వ్యక్తికి గొడవ జరుగగా.. అక్కడే బౌన్సర్‌గా ఉన్న ఫ్రాన్సిస్ సదరు ఫ్యాన్స్‌ను నెట్టివేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలాకాలం తర్వాత ఫ్రాన్సిస్ మరోసారి తెరమీదకు వచ్చాడు. ఇదిలా ఉంటే.. బాక్సర్ మైక్ టైసన్‌కు టాలీవుడ్‌తో అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో అతడు కీలక పాత్రలో కనిపించాడు.
చదవండి: ‘మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా..