విష్ణు–బాలాజీ జంట ఓటమి | Maharashtra Open: Sriram Balaji, Vishnu Vardhan exit in doubles semis | Sakshi
Sakshi News home page

విష్ణు–బాలాజీ జంట ఓటమి

Feb 5 2022 5:33 AM | Updated on Feb 5 2022 9:00 AM

Maharashtra Open: Sriram Balaji, Vishnu Vardhan exit in doubles semis - Sakshi

పుణే: టాటా ఓపెన్‌ ఏటీపీ– 250 టెన్నిస్‌ టోర్నీ డబుల్స్‌ విభాగంలో విష్ణు వర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం 2–6, 4–6తో టాప్‌ సీడ్‌ ల్యూక్‌ స్మిత్‌–జాన్‌ ప్యాట్రిక్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తమ సర్వీస్‌ను మూడు సార్లు కోల్పోయింది. నేడు సాదియో –ఫాబియన్‌ (ఫ్రాన్స్‌); రోహన్‌ బోపన్న–రామ్‌ కుమార్‌ (భారత్‌) జోడీల మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో రేపు జరిగే ఫైనల్లో ల్యూక్‌–జాన్‌ ప్యాట్రిక్‌ జంట ఆడుతుంది.

సుహానా సైనీకి కాంస్యం
ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) యూత్‌ కంటెండర్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి సుహానా సైనీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్‌లో శుక్రవారం జరిగిన అండర్‌–19 బాలికల సింగిల్స్‌ సెమీఫైనల్లో సుహానా 11–9, 9–11, 10–12, 11–13తో ప్రపంచ నంబర్‌వన్‌ ఎలీనా జహారియా (రొమేనియా) చేతిలో ఓడింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement