LSG VS GT: అన్నాదమ్ముల సవాల్‌.. కృనాల్‌, హార్ధిక్‌లను ఊరిస్తున్న రికార్డులివే..!

LSG VS GT: Stats And Records - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో అన్నాదమ్ముల జట్లు రెండోసారి ఎదురెదురుపడనున్నాయి. హార్ధిక్‌ పాండ్యా నాయకత్వం వహిస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌.. కృనాల్‌ పాండ్యా ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా ఇవాళ (మే 10) మరోసారి అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో చెరి 8 విజయాలు సాధించగా, లక్నో 16 పాయింట్లతో 0.703 రన్‌రేట్‌, గుజరాత్‌ 16 పాయింట్లతో 0.120 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 

సీజన్‌ తొలి అర్ధ భాగంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా, నేటి మ్యాచ్‌లో రాహుల్‌ సేన అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన గుజరాత్‌.. మహ్మద్‌ షమీ (3/25) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో లక్నో జట్టును 158 పరుగులకే కట్టడి చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో దీపక్‌ హుడా (55), ఆయుష్‌ బదోని (54) అర్ధ సెంచరీలతో రాణించారు. ఛేదనలో గుజరాత్‌ బ్యాటర్లు తలో చేయి వేయడంతో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్‌లో తెవాతియా (40*) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

నేటి మ్యాచ్‌లో గుజరాత్‌, లక్నో జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి..

  • గుజరాత్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ ఈ మ్యాచ్‌లో మరో నాలుగు వికెట్లు తీస్తే ఐపీఎల్‌లో 50 వికెట్ల క్లబ్‌లో చేరతాడు
  • లక్నో ఆల్‌రైండర్‌ కృనాల్‌ నేటి మ్యాచ్‌లో మరో సిక్సర్‌ బాదితే ఐపీఎల్‌లో 50 సిక్సర్ల మైలురాయి చేరుకుంటాడు
  • లక్నో ఓపెనర్‌ డికాక్‌ మరో 6 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో అరుదైన 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు
  • గుజరాత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మరో 5 సిక్సర్లు కొడితే 50 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు
  • లక్నో ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ మరో మరో 5 సిక్సర్లు కొడితే 50 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు
  • గుజరాత్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ 100 ఐపీఎల్‌ వికెట్లకు మరో 6 వికెట్ల దూరంలో ఉన్నాడు
  • లక్నో ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ 50 ఐపీఎల్‌ వికెట్లకు 3 వికెట్ల దూరంలో ఉన్నాడు

చదవండి: టాప్‌ టు జట్ల మధ్య పోరు.. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-05-2022
May 10, 2022, 18:31 IST
ఐపీఎల్‌-2022లో హార్ధిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో...
10-05-2022
May 10, 2022, 17:46 IST
ఐపీఎల్‌-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్‌ హిట్టర్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆరంభ మ్యాచ్‌లలో పావెల్‌ విఫలమైనా.. తర్వాత మ్యాచ్‌ల్లో...
10-05-2022
May 10, 2022, 16:47 IST
వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు షిమ్రన్‌ హెట్‌మైర్‌ తండ్రైన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెట్‌మైర్‌...
10-05-2022
May 10, 2022, 14:41 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టాప్‌ టు జట్ల మధ్య ఇవాళ (మే...
10-05-2022
May 10, 2022, 13:30 IST
టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్‌ 2022 సీజన్‌లో బిజీగా ఉన్నారు. ఆఖరి అంకానికి చేరుకున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌ మే...
10-05-2022
May 10, 2022, 13:30 IST
విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చిన బుమ్రా.. నేను వాటిని అసలు లెక్కచేయను!
10-05-2022
May 10, 2022, 12:58 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. లీగ్‌ ప్రారంభమై 15 ఏళ్లు గడుస్తున్నా ఆ జట్టు...
10-05-2022
May 10, 2022, 12:40 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్‌...
10-05-2022
May 10, 2022, 11:27 IST
IPL 2022 KKR Vs MI- Rohit Sharma Comments: ‘‘మా బౌలింగ్‌ విభాగం రాణించింది. బుమ్రా మరింత ప్రత్యేకం....
10-05-2022
May 10, 2022, 11:18 IST
ఐపీఎల్‌ 2022లో సోమవారం ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్‌ 52 పరుగుల సూపర్‌ విక్టరీ సాధించింది. తద్వారా తమ ప్లే ఆఫ్‌...
10-05-2022
May 10, 2022, 10:25 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఏది కలిసిరావడం లేదు. ఘోర ప్రదర్శనతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన ముంబై...
10-05-2022
May 10, 2022, 09:06 IST
ఐపీఎల్‌ 2022లో ​భాగంగా ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంతి కనిపించకపోవడంతో ఇషాన్‌...
10-05-2022
May 10, 2022, 08:33 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది....
10-05-2022
May 10, 2022, 08:01 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం మరోసారి ఒక బ్యాట్స్‌మన్‌ కొంపముంచింది. ఇప్పటికే ఈ సీజన్‌లో థర్డ్‌...
10-05-2022
May 10, 2022, 05:21 IST
ముంబై: తొలి పది మ్యాచ్‌లలో తీసింది 5 వికెట్లే... ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బౌలర్‌...
09-05-2022
May 09, 2022, 23:03 IST
ఐపీఎల్‌-2022లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. ఈ...
09-05-2022
May 09, 2022, 19:33 IST
Suryakumar Yadav ruled out IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌...
09-05-2022
09-05-2022
May 09, 2022, 18:46 IST
Moeen Ali Lauds Devon Conway: హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలతో సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న డెవాన్‌ కాన్వేపై అతని...
09-05-2022
May 09, 2022, 18:27 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘోర పరాజయం పాలైన... 

Read also in:
Back to Top