Australia Pakistan Tour: పాకిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ఇక..!

Lahore bomb blast was carried out to disrupt PSL 2022 and Australias tour of Pakistan - Sakshi

Australias tour of Pakistan: పాకిస్తాన్‌లోని లాహోర్ న‌గ‌రంలో భారీ బాంబు పేలుడు చోటు చేసుకున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 30 మంది గాయ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఆ దేశ కేంద్ర మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు ఆస్ట్రేలియా పర్యటనను అడ్డుకోవడమే బాంబు పేలుళ్ల ప్రధాన ఉద్దేశ్యమని అత‌ను అభిప్రాయపడ్డారు. కాగా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2022 జ‌న‌వ‌రి 27న‌ ప్రారంభం కానుంది. 

"దేశంలో శాంతి నెలకొనడంతో పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు ముష్క‌రులు ప్ర‌య‌త్నిస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌, చారిత్రాత్మ‌క ఆస్ట్రేలియా పర్యటనను అడ్డుకోవడమే ఈ పేలుడు ముఖ్య ఉద్దేశ్యం. కానీ మేము దానిని జరగనివ్వము" అని రషీద్ అహ్మద్ పేర్కొన్నారు. ఇక 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు తొలి సారిగా పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మార్చిలో ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. అయితే ఈ పేలుడుతో ఆసీస్ ప‌ర్య‌ట‌న మ‌రోసారి సందిగ్ధంలో ప‌డింది.

చ‌ద‌వండి: హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కి బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. భార‌త జ‌ట్టులో చోటు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top