Virat Kohli: కోహ్లి అరుదైన ఫీట్‌.. తొలి ఆసియా కెప్టెన్‌గా

Kohli Becomes 1st Indian Captain To Win Minimum 2 Tests AUS-ENG-SA - Sakshi

''మెగాటోర్నీలు గెలవలేడు'' అనే అపవాదు కోహ్లిపై ఉన్నప్పటికి.. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మాత్రం కెప్టెన్‌గా కోహ్లి అదుర్స్‌ అనిపించాడు. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎక్కువ సక్సెస్‌ రేటు ఉన్న ఆటగాడిగా కోహ్లి మంచి రికార్డు ఉంది. ఇక సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడం ద్వారా కెప్టెన్‌గా కోహ్లి అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. 2018 నుంచి చూసుకుంటే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ గడ్డపై కనీసం రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన తొలి కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

2018లో సౌతాఫ్రికా పర్యటనలో జోహెన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి ఆ గడ్డపై తొలి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా సెంచూరియన్‌ వేదికగా ప్రొటీస్‌పై రెండో విజయాన్ని అందుకునాడు.

2018 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన టెస్టుల్లో కోహ్లి కెప్టెన్‌గా విజయాలు అందుకున్నాడు. ఇక 2020-21 ఆసీస్‌ పర్యటనలో కోహ్లి నాయకత్వంలోని టీమిండియా తొలి టెస్టులో ఓటమి పాలైంది. అయితే వ్యక్తిగత కారణాల రిత్యా మిగతా టెస్టులకు కోహ్లి దూరమవ్వడం.. రహానే నాయకత్వ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనకందరికి తెలిసిన విషయమే.

ఇక 2018 ఇంగ్లండ్‌ పర్యటనలో ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా విజయం అందుకున్న కోహ్లి.. 2021 పర్యటనలో ఏకంగా రెండు విజయాలు అందుకున్నాడు. లార్డ్స్‌, ఓవల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. 

ఇక విదేశాల్లో టీమిండియా ఆడిన బాక్సింగ్‌ డే టెస్టులు కూడా కోహ్లికి బాగా కలిసి వచ్చాయి. 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్‌ డే టెస్టును టీమిండియా గెలుచుకుంది. ఇక తాజగా 2021లో సౌతాఫ్రికా గడ్డపై సెంచూరియన్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. తద్వారా విదేశాల్లో రెండు బాక్సింగ్‌ డే టెస్టులు గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top